https://oktelugu.com/

Malli Pelli Collections:16 కోట్లతో తీసిన ‘మళ్ళీ పెళ్లి’ సినిమాకి మొదటి రోజు ఇంత ఓపెనింగ్ వచ్చిందా..? నరేష్ లక్ మామూలుగా లేదుగా!

పవిత్ర లోకేష్ తో తన ప్రేమాయణం ఎలా మొదలైంది, ఎలాంటి పరిస్థితుల మధ్య మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము అని జనాలకు చెప్పే ప్రయత్నం లో భాగంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు నరేష్.ఇందులో నరేష్ మరియు పవిత్ర లోకేష్ వారి పాత్రలను వాళ్ళు వెయ్యగా

Written By:
  • Vicky
  • , Updated On : May 26, 2023 3:33 pm
    Malli Pelli Collection

    Malli Pelli Collection

    Follow us on

    Malli Pelli Collection: తమ మీద వచ్చిన నెగటివ్ పబ్లిసిటీ ని కూడా అనుకూలంగా మార్చుకునే ప్రక్రియ లో ప్రముఖ సీనియర్ నటుడు నరేష్ ‘మళ్ళీ పెళ్లి’ అనే చిత్రాన్ని నిర్మించి నటించాడు. ప్రముఖ నిర్మాత MS రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ‘వాన’ చిత్రం తర్వాత ఆయన దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ఇదే. ప్రస్తుతం సినిమా చెయ్యకుండా ఖాళీగా ఉంటున్న ఈయనకి దర్శకత్వం వహించే బాధ్యతని అప్పజెప్పాడు నరేష్.

    పవిత్ర లోకేష్ తో తన ప్రేమాయణం ఎలా మొదలైంది, ఎలాంటి పరిస్థితుల మధ్య మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము అని జనాలకు చెప్పే ప్రయత్నం లో భాగంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు నరేష్.ఇందులో నరేష్ మరియు పవిత్ర లోకేష్ వారి పాత్రలను వాళ్ళు వెయ్యగా, నరేష్ మూడవ భార్య రమ్య పాత్రని వనిత విజయ్ కుమార్ చేసింది. నేడు గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాకి ఎలాంటి ఓపెనింగ్స్ వచ్చాయో ఒకసారి చూద్దాము.

    నెగటివ్ పబ్లిసిటీ తో కూడా బిజినెస్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో నరేష్ చేసిన ఈ ప్రయత్నం సఫలం అయ్యిందనే చెప్పాలి. మన ఆడియన్స్ కి వివాదాలు అన్నా, వాటి గురించి తెలుసుకోవాలన్నా ఎంతో ఆసక్తి ఉంటుంది. నరేష్ – పవిత్ర పెళ్లి వ్యవహారం గురించి కూడా తెలుసుకోవాలని టీజర్ మరియు ట్రైలర్ చూసినప్పుడే ఆడియన్స్ లో కుతూహలం మొదలైంది. ఫలితంగా ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ దక్కాయి.

    ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి మొదటి రోజు మంచి ఆక్యుపెన్సీలతోనే మొదలైందని, ఇదే ట్రెండ్ మిగిలిన షోస్ కి కూడా కొనసాగితే కోటి రూపాయలకు పైగా గ్రాస్ మరియు 60 లక్షలకు పైగా షేర్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ చిత్రాన్ని నరేష్ 16 కోట్ల రూపాయిలు పెట్టి నిర్మించాడు. డిజిటల్ + సాటిలైట్ రైట్స్ ద్వారానే ఆయనకీ పెట్టిన బడ్జెట్ వచ్చేసింది, ఇక థియేటర్స్ నుండి వచ్చేది మొత్తం బోనస్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు.