https://oktelugu.com/

ప్చ్.. సురేష్ బాబు కూడా ఇలా చేస్తే ఎలా ?

కరోనా మహమ్మారి థియేటర్ల వ్యవస్థనే సర్వనాశనం చేసేలా కనిపించింది. కానీ, ఎట్టకేలకు ఆ దిశగా పూర్తి అడుగులు పడకముందే.. కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం తగ్గింది. అందుకే ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌ ల్లో థియేటర్లు తెరవడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. కాకపోతే థియేటర్ల వ్యాపారం ఇప్పట్లో పుంజుకునేలా లేదు. ఇంకా మరో రెండు నెలలు టైం పట్టేలా ఉంది. దీనికితోడు థియేటర్ల యాజమాన్యాలకు అనేక సమస్యలు ఉన్నాయి. వారంతా ప్రభుత్వ సాయం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. […]

Written By:
  • admin
  • , Updated On : July 6, 2021 / 11:47 AM IST
    Follow us on

    కరోనా మహమ్మారి థియేటర్ల వ్యవస్థనే సర్వనాశనం చేసేలా కనిపించింది. కానీ, ఎట్టకేలకు ఆ దిశగా పూర్తి అడుగులు పడకముందే.. కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం తగ్గింది. అందుకే ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌ ల్లో థియేటర్లు తెరవడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. కాకపోతే థియేటర్ల వ్యాపారం ఇప్పట్లో పుంజుకునేలా లేదు. ఇంకా మరో రెండు నెలలు టైం పట్టేలా ఉంది.

    దీనికితోడు థియేటర్ల యాజమాన్యాలకు అనేక సమస్యలు ఉన్నాయి. వారంతా ప్రభుత్వ సాయం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితిలో ఓటీటీ రూపంలో థియేటర్లకు ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ఆపడానికి ఇటీవల ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో వారంతా తేల్చి చెప్పింది ఒక్కటే. దయచేసి పెద్ద సినిమాలను ఓటీటీకి అమ్మొద్దు అని.

    అయితే, ఎగ్జిబిటర్లు విజ్ఞప్తి చేసినా… ‘నారప్ప’ ఓటీటీలోకి వెళ్ళడానికే తెగ ఆరాటపడుతున్నాడు. ఎలాగైనా నారప్పను అడ్డుకోండి అంటూ ఎగ్జిబిటర్లు నారప్ప సినిమా నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుకి తాజాగా విజ్ఞప్తి చేశారు. వ్యాపారంలో లాభం తప్ప, మరేమీ పట్టించుకునే స్వభావం లేని సురేష్ బాబు, వారి విజ్ఞప్తిని ఎంతవరకు అంగీకరిస్తారు అన్నదే ఇక్కడ ప్రశ్న.

    నిజానికి సురేష్ బాబు డిస్ట్రిబ్యూటర్ కూడా, అలాగే ఎగ్జిబిటర్ కూడా. కానీ, ఎగ్జిబిటర్ల బాధలను సురేష్ బాబు పట్టించుకునేలా కనిపించడం లేదు. సురేష్ బాబు ఇప్పటికే తన నిర్మాణంలో వస్తోన్న ‘దృశ్యం 2’ సినిమాని డైరెక్ట్ గా హాట్ స్టార్ లో విడుదల చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు. ఈ సినిమా డీల్ కూడా క్లోజ్ అయింది.

    అలాగే ‘నారప్ప’ని డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. మొత్తానికి సురేష్ బాబు లాంటి వ్యక్తే ఓటీటీల వైపే చూస్తే, ఇక చిన్న నిర్మాతలు రిస్క్ చేసి మరీ, తమ సినిమాని ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో థియేటర్స్ లో ఎందుకు రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ‘ప్చ్.. సురేష్ బాబే ఇలా చేస్తే ఎలా ?’ అంటూ తలలు పట్టుకుంటున్నారు.