Karthik Rathnam: విలక్షణ చిత్రాలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసిన నటుడు ‘కార్తీక్’. కేరాఫ్ కంచరపాలెం నుంచి నారప్ప వరకూ కార్తీక్ పాత్రలకు అత్యంత ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించాడు.నారప్ప సినిమాలో వెంకటేశ్ కొడుకుకు దుమ్మురేపాడు. అత్యంత ఆవేశపరుడైన యువకుడిగా అతడి నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఈ క్రమంలోనే నారప్ప కుమారుడు ‘కార్తీక్ రత్నం’ ప్రస్తుతం పెళ్లిపీటలెక్కబోతున్నాడు. శనివారం అతడి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతోపాటు సన్నిహితులు, స్నేహితులు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు హాజరయ్యారు.
ప్రస్తుతం కార్తీక్ రత్నం ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అతడికి కాబోయే భార్య గురించి అందరూ ఆరాలు తీస్తున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన సంబంధం అని.. దగ్గరి బంధువుల అమ్మాయినే కార్తీక్ పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిసింది. కార్తీక్ కాబోయే భార్య పేరు శ్వేత అని అంటున్నారు.
Also Read: సినీ తారల నేటి క్రేజీ పోస్ట్ లు
హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన కార్తీ సీఏ కోర్సును మధ్యలోనే ఆపేసి మరీ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. రానా దగ్గుబాటి నిర్మించిన ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో అతడు పోషించిన జోసెఫ్ పాత్ర కు మంచి గుర్తింపు దక్కింది.ఇదే సినిమాను తమిళంలో రిమేక్ చేయగా అందులోనూ నటించాడు.
వెంకటేశ్ నారప్పలో కార్తీక్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. తాజాగా ‘అర్ధశతాబ్దం’ అనే సినిమాలో హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు.నితిన్ ‘చెక్’, సంక్రాంతికి విడుదలైన ‘రౌడీబాయ్స్’ సినిమాలోనూ నటించాడు.
Also Read: జపాన్‌లోనూ ‘భీమ్లానాయక్’ మేనియా… మామూలుగా లేదుగా..!!