Nara Rohit : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) నటించిన ‘పుష్ప'(Pushpa) సిరీస్ దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు పుట్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక విధంగా చెప్పాలంటే నేటి తరాన్ని మొత్తం ప్రభావితం చేసింది ఈ సినిమా. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, నార్త్ ఇండియా లో కూడా ఈ పుష్ప సిరీస్ ఒక సునామీ ని సృష్టించింది. అయితే ఈ చిత్రం అల్లు అర్జున్ పుష్ప క్యారక్టర్ ఎంత హైలైట్ అయ్యిందో, భన్వర్ సింగ్ షికావత్ క్యారక్టర్ కూడా అంతే హైలైట్ అయ్యింది. ‘పుష్ప’ మొదటి భాగం లో చివరి 30 నిమిషాలు ఉన్నప్పుడు ఈ క్యారక్టర్ పరిచయం అవుతుంది. కనిపించేది కాసేపే అయినప్పటికీ చాలా పవర్ ఫుల్ గా అనిపించింది. సెకండ్ పార్ట్ లో పుష్ప మరియు భన్వర్ సింగ్ షికావత్ క్యారెక్టర్స్ మధ్య నువ్వా నేనా అనే రేంజ్ పోటీ ఉంటుందని అంతా అనుకున్నారు, అదే విధంగా తెరకెక్కించారు కూడా.
Also Read : మాయమైన హార్డ్ డ్రైవ్ లో ప్రభాస్ యాక్షన్ సన్నివేశాలు..బోరుమని విలపిస్తున్న ‘కన్నప్ప’ టీం!
అయితే సినిమాలో లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఇందులో ‘పుష్ప’ హీరో క్యారక్టర్, భన్వర్ సింగ్ షికావత్ విలన్ క్యారక్టర్. కానీ కథ పరంగా చూస్తే ఈ సినిమాలు ఈ రెండు పాత్రలు నెగటివ్ పాత్రలే. డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ రెండు క్యారెక్టర్స్ ని స్క్రీన్ పై నువ్వా నేనా అనే రేంజ్ లో చూపించాడు. హీరో క్యారక్టర్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుంది ఈ క్యారక్టర్. ఫహాద్ ఫాజిల్(Fahad Fazil) తప్ప ఈ క్యారక్టర్ లో ఎవ్వరూ నటించలేరు అనే రేంజ్ లో ఆయన జీవించాడు. అయితే ఈ పాత్ర కోసం ముందుగా నారా రోహిత్(Nara Rohit) ని సంప్రదించారట మేకర్స్. ఆయన కూడా ఈ పాత్ర చేయడానికి వెంటనే ఓకే చెప్పాడట. మీసాలు, గుండు లుక్స్ తో నారా రోహిత్ కి లుక్ టెస్ట్ కూడా అయ్యిందట.
డైరెక్టర్ సుకుమార్ తో క్యారక్టర్ గురించి చర్చలు కూడా జరిపాడట. కానీ నిర్మాతలు ఈ పాత్రకు నారా రోహిత్ కంటే పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు ఉన్న నటుడు చేస్తే ఇంకా ఎక్కువ రీచ్ ఉంటుందని చెప్పడంతో ఫహాద్ ఫాజిల్ ని ఎంచుకున్నారట. ఒక వేళ నారా రోహిత్ ఈ క్యారక్టర్ చేసి ఉండుంటే ఆయన కెరీర్ కి ఎంత ఉపయోగపడేది. హీరో గా ఎన్నో విభిన్నమైన సినిమాలు చేసాడు కానీ, కమర్షియల్ విజయాలు మాత్రం నారా రోహిత్ కెరీర్ లో పెద్దగా లేవు. కేవలం సోలో అనే చిత్రం మాత్రమే కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ విడుదలైన సంగతి కూడా ప్రేక్షకులకు తెలియదు. ఒకవేళ ఈ క్యారక్టర్ ఒప్పుకొని చేసుంటే నారా రోహిత్ కి హీరో గా కూడా తన తదుపరి చిత్రాలకు మంచి హైప్ ఏర్పడేవి. మంచి ఛాన్స్ దురదృష్టం కొద్దీ మిస్ అయ్యింది.
One attachment
• Scanned by Gmail