Nara Rohit: హీరో నారా రోహిత్.. ఐదేళ్ల క్రితం ఏడాదికి ఎనిమిది సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అసలు రోహిత్ ఇంత వేగంగా ఎలా సినిమాలు చేస్తున్నాడు ? అంటూ సినీ జనం కూడా చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసేవారు. ఐతే.. ఒకప్పుడు నారా రోహిత్ ఎంత వేగంగా సినిమాలు చేశాడో.. ఇప్పుడు అంత స్లోగా సినిమాలు చేస్తున్నాడు. ఆ మాటకొస్తే.. అసలు సినిమాలే చేయడం లేదు.
ముఖ్యంగా ఫిట్నెస్ విషయంలో నారా రోహిత్ వీక్ గా ఉన్నాడు అని ఆయన ఇటీవల ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది. ఈ మధ్య నారా రోహిత్ ఓ సినిమా ఫంక్షన్ లో కనిపించారు. ఆ ఫంక్షన్ లోని నారా రోహిత్ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల్లో నారా రోహిత్ పొట్టతో కనిపించాడు. పైగా ఫేస్ కూడా బాగా ఉబ్బింది.
ఇంకా వయసు 40 కూడా దాటలేదు, అప్పుడే ఇలా అవుట్ ఆఫ్ షేప్ అయితే ఎలా రోహిత్ ? అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. బహుశా నారా రోహిత్ కూడా ఈ విషయాన్ని విని విని విసిగిపోయాడు. అందుకే, తాజాగా తన లుక్ పై నారా రోహిత్ ఫోకస్ పెట్టాడు. ఇప్పుడు లావు తగ్గి, మంచి ఫిట్ నెస్ సాధించే పనిలో నారా రోహిత్ ఉన్నాడని తెలుస్తోంది.
ఇక కథల విషయంలో కూడా కొంచెం సీరియస్ గా ఆలోచించి సెలెక్ట్ చేసుకుంటే, భవిష్యత్తులో మంచి ఫలితం ఉంటుందని.. మళ్లీ తన కెరీర్ ఫామ్ లోకి వస్తోందని నారా రోహిత్ ఆశ పడుతున్నాడు. నిజానికి నారా రోహిత్ టాలెంట్ కి తగ్గ హిట్ వచ్చి చాలా కాలమే అయింది. దీంతో సినిమాల పై నారా రోహిత్ వెక్స్ అయిపోయాడు అని కూడా టాక్ వినిపించింది.
అన్నిటికీ మించి నారా రోహిత్ ప్లాపుల లిస్ట్ పెరిగిపోతూనే ఉంది. దీనికి అడ్డుకట్ట వేసి మళ్ళీ ఫామ్ లోకి రావాలంటే ఫిట్నెస్ తో పాటు బెటర్ స్టోరీస్ కూడా కావాలి. అలాగే మంచి డైరెక్టర్లతో సినిమాలు చేయాలి. ప్రస్తుతం ఈ విషయాల పైనే నారా రోహిత్ కసరత్తులు చేస్తున్నాడు.
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: Nara rohit focuses on fitness
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com