https://oktelugu.com/

Tuck Jagadish Movie: వీడియోతో హీరో నాని సర్ ప్రైజ్

Tuck Jagadish Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోయే హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకరు. సహజసిద్ధమైన నటనతో ప్రతి సినిమాలోనూ అదిరిపోయే పర్ ఫామెన్స్ ఇస్తూ ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాడితను. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ మార్కెట్ ను గణనీయంగా పెంచుకుంటున్నారు. తాజాగా హీరో నాని ఓ సర్ ప్రైజింగ్ వీడియోతో ఎంట్రీ ఇచ్చి ఓ గుడ్ న్యూస్ చెప్పారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : August 27, 2021 / 04:56 PM IST
    Follow us on

    Tuck Jagadish Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోయే హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకరు. సహజసిద్ధమైన నటనతో ప్రతి సినిమాలోనూ అదిరిపోయే పర్ ఫామెన్స్ ఇస్తూ ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాడితను. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ మార్కెట్ ను గణనీయంగా పెంచుకుంటున్నారు.

    తాజాగా హీరో నాని ఓ సర్ ప్రైజింగ్ వీడియోతో ఎంట్రీ ఇచ్చి ఓ గుడ్ న్యూస్ చెప్పారు. హీరో నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ అనే కుటుంబ కథా చిత్రాన్ని చేశాడు. ఐశ్వర్య రాజేశ్, రీతూ వర్మ నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. దీన్ని షైస్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు. నాజర్, జగపతి బాబు, రావు రమేశ్ కీలక పాత్రధారులు.

    సాధారణంగా నాని సినిమాలు లవ్ స్టోరీలు, కుటుంబ కథా చిత్రాలుగా ఉంటాయి. కానీ తాజాగా ‘టక్ జగదీష్’ చిత్రం మాత్రం మాస్ గా ఉంది. టీజర్ పోస్టర్లలో కత్తి పట్టుకొని నాని కొంచెం మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.

    ‘టక్ జగదీష్’ను సమ్మర్ లోనే విడుదల చేయాలని భావించగా.. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా అది సాధ్యపడలేదు. తాజాగా ‘టక్ జగదీష్ ’ మూవీని అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదల చేస్తున్నారు.

    నేచురల్ స్టార్ నాని తాజాగా ‘టక్ జగదీష్’ మూవీ ఓటీటీ విడుదలకు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చాడు. ‘పండుగకు మన ఫ్యామిలీతో మీ టక్ జగదీశ్’ అని ఒక వీడియోను పంచుకున్నాడు. దీన్ని చూసి నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబరు 10 నుంచి ‘టక్ జగదీష్’ స్ట్రీమింగ్ కానున్నట్టు చెబుతున్నాడు. మొదలెట్టండి’ అనే డైలాగ్ ను చూపించి ఈ ప్రమోషన్ ను స్ట్రాట్ చేశాడు.