https://oktelugu.com/

నాని కొత్త ప్రయోగం.. ‘అంటే సుందరానికీ’ మోషన్ పోస్టర్ రిలీజ్..!

టాలీవుడ్లో నానికి నేచురల్ స్టార్ గా మంచి గుర్తింపు ఉంది. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నాడు నాని. అయితే గత కొంతకాలంగా నాని కెరీర్ ఒడిదుడుకలు ఎదుర్కొంటోంది. ‘జెర్సీ’ తర్వాత నానికి సరైన హిట్టు రాలేదు. దీంతో అతడు తప్పనిసరిగా హిట్టుకొట్టాల్సిన పరిస్థితి నెలకొంది. Also Read: కంగనా మీదికి వర్మ ‘శశికళ’ కత్తి ఇటీవల నాని నటించిన 25వ సినిమా ‘వి’ ఓటీటీలో విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. […]

Written By: , Updated On : November 22, 2020 / 04:20 PM IST
Follow us on

Nani Shyam Singha Roy Movie

టాలీవుడ్లో నానికి నేచురల్ స్టార్ గా మంచి గుర్తింపు ఉంది. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నాడు నాని. అయితే గత కొంతకాలంగా నాని కెరీర్ ఒడిదుడుకలు ఎదుర్కొంటోంది. ‘జెర్సీ’ తర్వాత నానికి సరైన హిట్టు రాలేదు. దీంతో అతడు తప్పనిసరిగా హిట్టుకొట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

Also Read: కంగనా మీదికి వర్మ ‘శశికళ’ కత్తి

ఇటీవల నాని నటించిన 25వ సినిమా ‘వి’ ఓటీటీలో విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ నాని నాలుగైదు సినిమాలను లైన్లో పెట్టి వరుస  సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం నాని ‘శ్యామ్ సింగరాయ’.. ‘టాక్ జగదీష్’.. ‘అంటే సుందరానికీ’ సినిమాలను చేస్తున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి ’ సినిమా రాబోతుందని దీపావళి సందర్భంగా ప్రకటన వచ్చింది.

ఈ మూవీలో నానికి జోడీగా మలయాళ హీరోయిన్ నజ్రియా నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌తోపాటు కర్టన్‌ రైజర్‌ని చిత్రబృందం నేడు విడుదల చేసింది. ‘అంటే సుందరానికీ’ అన్న టైటిల్‌తో విడుదలైన మోషన్ పోస్టర్ సినీప్రియులను ఆకట్టుకుంటోంది.

Also Read: ఆ సీరియల్ హీరో దారుణంగా ఏడిపిస్తాడట !

ఈ మూవీ మోషన్ పోస్టర్ లో నాని పంచెకట్టు.. షర్టుతో ఉండగా.. చేతిలో లగేజ్‌ బ్యాగ్‌.. కోటు ఉంది. వీటితోపాటు సైకిల్‌.. షూస్‌.. వీణ.. కెమెరా.. పచ్చళ్ల డబ్బాలు.. రాశుల చక్రం, ఫ్లైట్‌ ఉన్నాయి. ఈ పోస్టర్ చూడగానే అచ్చమైన తెలుగు సినిమాగా ఉండనుందన్న ఫీలింగ్ కలుగక మానదు. మరోసారి నాని వైవిధ్యమైన పాత్రలో కన్పించబోతున్నాడు. ఈ సినిమాకు వివేక్‌ సాగర్ సంగీతం అందిస్తుండగా నికేత్‌ బొమ్మి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Nani 28 Curtain Raiser | Nani | Nazriya Fahadh | Vivek Athreya | Vivek Sagar | Ante Sundaraniki