Homeఎంటర్టైన్మెంట్నాని ‘జెర్సీ’కి అరుదైన ఘనత...

నాని ‘జెర్సీ’కి అరుదైన ఘనత…


కథలు, పాత్రల ఎంపికలో ఎప్పటికప్పుడు ప్రత్యేకత చాటుకుంటూ హిట్‌ ట్రాక్‌లో దూసుకెళ్తున్నాడు యువ కథానాయకుడు నాని. ఫిల్మ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాని యంగ్‌ హీరోల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో అతనికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. నాని సినిమా వస్తుందంటే కచ్చితంగా వైవిధ్యం ఉంటుందని ప్రేక్షకులు, పెట్టిన డబ్బయినా వస్తుందని నిర్మాతల్లో భరోసా ఏర్పడింది. ఫస్ట్‌ మూవీ ‘అష్టా చమ్మా’ నుంచే సహజ నటనతో మెప్పించిన అతను నేచురల్‌ స్టార్ అనే పేరు తెచ్చుకున్నాడు. ఏ పాత్ర ఇచ్చినా అందులో లీనమై నటిస్తాడు నాని. తన మార్కు డైలాగ్‌ డెలివరీ, కామెడీ టైమింగ్‌తో ఆ పాత్రను ఎలివేట్‌ చేయడంలో అతను దిట్ట. అలా మొదలైంది, పిల్ల జమిందార్, ఎటో వెళ్లిపోయింది మనసు, ఎవడే సుబ్రమణ్యం, జెంటిల్‌మన్‌, నిన్ను కోరి, కృష్ణార్జున యుద్ధం, దేవదాస్‌ ఇలా ఏ సినిమా చెప్పిన నాని పాత్ర కళ్ల ముందు కదలాడుతుంది.

Also Read: స్టైలిష్‌ స్టార్+ సక్సెస్‌ఫుల్‌‌ డైరెక్టర్.. క్రేజీ కాంబో

ఇవన్నీ ఒకెత్తయితే గతేడాది వచ్చిన ‘జెర్సీ’ చిత్రం మరో ఎత్తు. నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఘన విజయం సొంతం చేసుకుంది. లాస్ట్‌ ఇయర్ ఏప్రిల్‌లో విడుదలైన ఈ మూవీ నటుడిగా నానిని మరో మెట్టు ఎక్కించింది. క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రంలో తన తండ్రిని హీరోగా చూడాలని కోరుకున్న కొడుకు కోరిక తేర్చే పాత్రలో నాని నటన అద్భుతం. అనారోగ్యం కారణంగా ఆటను వదిలేసిన ఓ ప్రతిభావంతుడైన యువకుడు పెళ్లి చేసుకున్న తర్వాత తన కుమారుడికి ఇచ్చిన మాట కోసం 36 ఏళ్ల వయసులో తిరిగి క్రికెట్‌లో అడుగు పెట్టడం.. ప్రాణం పోతుందని తెలిసి కూడా లక్ష్యం కోసం పోరాడడం ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించింది. పెళ్లికి ముందు నాని, శ్రద్ధ మధ్య లవ్‌ ట్రాక్ ఎంతగానో ఆకట్టుకుంది. నాని కొడుకుగా రోనిత్ అద్భుతమైన పాత్రను పోషించాడు. కోచ్‌గా సత్యరాజ్‌ పాత్ర కూడా కీలకం. ‘మళ్లీ రావా’ ఫేమ్‌ గౌతమ్ తిన్ననూరి చిన్న చిన్న భావోద్వేగాలను అద్బుతంగా తెరకెక్కించాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్‌లో సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ మూవీ ఇప్పుడు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. హీరోగా నాని కెరీర్లో మైలురాయిగా నిలిచిన జెర్సీ.. ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఇండియన్ టొరంటో ఫిలిం ఫెస్టివల్ కు ఎంపికైంది. ఆగస్టు 9 నుంచి 15 వరకు జరిగే ఈ ఉత్సవంలో విదేశీ సినిమా విభాగంలో జెర్సీ పోటీ పడనుంది. ఇండియా నుంచి హృతిక్‌ రోషన్‌ నటించిన ‘సూపర్ 30’, కార్తీ నటించిన ‘ఖైదీ’ (తమిళ్) కూడా టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేయనున్నాయి. కాగా, జెర్సీ మూవీ త్వరలోనే హిందీలో రీమేక్‌ కానుంది. రీమేక్‌లో షాహిద్‌ కపూర్ లీడ్‌ రోల్‌ పోషించనున్నాడు. ఏదేమైనా ఈ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు తెలుగు నుంచి ఒక సినిమా ఎంపికవడం అది తన మూవీ కావడం నానికి నిజంగా గర్వకారణమే అని చెప్పాలి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version