https://oktelugu.com/

ముగ్గురు హీరోయిన్లతో నాని రొమాన్స్!

టాలీవుడ్‌లో ఈ మధ్య డబుల్ హీరోయిన్ల ఫార్ములా నడుస్తోంది. చాలా సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లను తీసుకుంటున్నారు డైరెక్టర్లు. యువ హీరోలతో పాటు సీనియర్ యాక్టర్లు కూడా ఇదే ఫార్ములా కొనసాగిస్తున్నారు. నేచురల్ యాక్టర్ నాని కూడా ఇదే కోవలో ఉన్నాడు. పిల్ల జమిందార్, ఎవడే సుబ్రమణ్యం, జెంటిల్మెన్, మజ్ఞు, కృష్ణార్జున యుద్ధం చిత్రాల్లో ఇద్దరేసి హీరోయిన్లతో నటించాడు. జెర్సీ, గ్యాంగ్‌ లీడర్లో ఒక్క హీరోయిన్‌తో సరిపెట్టాడు. కానీ, ఇప్పుడు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్‌కు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 29, 2020 / 02:37 PM IST
    Follow us on


    టాలీవుడ్‌లో ఈ మధ్య డబుల్ హీరోయిన్ల ఫార్ములా నడుస్తోంది. చాలా సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లను తీసుకుంటున్నారు డైరెక్టర్లు. యువ హీరోలతో పాటు సీనియర్ యాక్టర్లు కూడా ఇదే ఫార్ములా కొనసాగిస్తున్నారు. నేచురల్ యాక్టర్ నాని కూడా ఇదే కోవలో ఉన్నాడు. పిల్ల జమిందార్, ఎవడే సుబ్రమణ్యం, జెంటిల్మెన్, మజ్ఞు, కృష్ణార్జున యుద్ధం చిత్రాల్లో ఇద్దరేసి హీరోయిన్లతో నటించాడు. జెర్సీ, గ్యాంగ్‌ లీడర్లో ఒక్క హీరోయిన్‌తో సరిపెట్టాడు. కానీ, ఇప్పుడు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్‌కు రెడీ అయ్యాడు. నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్‌’ . కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ మూవీకి ‘ట్యాక్సీ వాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్నాడు. వెరైటీ టైటిల్‌ పెట్టి అంతే వెరైటీగా దాన్ని రివీల్‌ చేసిన చిత్రం గురించి ఆసక్తికర విషయం తెలిసింది.

    పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు.. కాపు నేతలు మేల్కొనేదెప్పుడు?

    ఈ మూవీలో నాని మూడు డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తాడట. అది తిపాత్రాభినయమా? కాదా? అనేది సస్పెన్స్‌. ముగ్గురు హీరోయిన్స్‌ కూడా ఉంటారట. ఇప్పటికే సాయి పల్లవిని సెలెక్ట్ చేశారని సమాచారం. మరో హీరోయిన్‌‌గా చేయమని రష్మిక మందాన్నను అడిగితే ఆమె నో చెప్పింది. మాళవిక మోహనన్‌‌ని, శోభిత ధూళిపాళని తీసుకున్నారని సమాచారం. ప్రధాన హీరోయిన్‌ సాయి పల్లవినే అని తెలుస్తోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమవ్వాల్సిం ది. కానీ లాక్ డౌన్ కారణంగా ఇంకా పట్టాలెక్కలేదు. మరోవైపు విలన్‌గా నటించిన ‘వి’ మూవీ రిలీజ్‌కు సిద్దంగా ఉంది. ఇంకోవైపు శివ నిర్వాణ డైరెక్షన్‌లో ‘టక్ జగదీశ్‌’ చేస్తున్న నాని.. వివేక్ ఆత్రేయతో ఒక సినిమాకు కమిటయ్యాడు ఇంకోవైపు నిర్మాతగా కూడా బిజీగానే ఉన్నాడు. ఇలాంటి టైమ్‌లో కరోనా దెబ్బకు షూటింగ్స్‌ ఆగిపోవడంతో అందరిమాదిగానే అతను ఇంటికే పరిమితమయ్యాడు.