The Paradise Movie Release Date: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమా ఆగస్టు 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాని మొదట మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ గత సంవత్సరం ఇండస్ట్రీలో ఉన్న కార్మికులందరూ సమ్మె చేయడం వల్ల దాదాపు నెల రోజులపాటు షూటింగ్స్ ఆగిపోయాయి. దానివల్ల ఈ సినిమా షూటింగ్ నెల రోజులు డిలే పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో షూటింగ్ లేట్ అవ్వడమే కాకుండా రిలీజ్ డేట్ కూడా లేట్ అవుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఆగస్టు 21వ తేదీన ఈ సినిమాని అఫీషియల్ గా రిలీజ్ చేస్తున్నామంటూ సినిమా యూనిట్ నుంచి ఒక అనౌన్స్ మెంట్ బయటకు వచ్చింది. ఇక మొత్తానికైతే ఈ సినిమా ఈ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది.
నాని ని మాస్ హీరోగా నిలబెడుతుందా? శ్రీకాంత్ ఓదెల టాప్ డైరెక్టర్ గా మారిపోతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక సినిమా రిలీజ్ కి చాలా రోజుల సమయం ఉన్నందున సినిమాను చాలా నిదానంగా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఏప్రిల్ లో ఈ సినిమాకి గుమ్మడికాయ కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అప్పటినుంచి మూడు నెలల పాటు సినిమా రిలీజ్ కి సమయం ఉంటుంది. కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా చాలా వేగవంతంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశ్యంతోనే శ్రీకాంత్ ఓదెల ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఇద్దరు కలిసి ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది…
నాని ఈ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు. స్టార్ హీరోలందరికి పోటీని ఇచ్చే విధంగా టైర్ వన్ హీరోగా మారతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా పాన్ ఇండియాలోనే కాకుండా పాన్ వరల్డ్ లో రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ సినిమాకి రిలైజైన అన్నిచోట్ల ఎలాంటి ఆదరణ దక్కుతుంది అనేది తెలియాల్సి ఉంది…