Nani The Paradise: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్'(The Paradise Movie). ‘దసరా’ నుండి ‘హిట్ 3’ వరకు మూడు సార్లు వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకున్న నాని, ఈసారి కొడితే కుంభస్థలం బద్దలు అవ్వాలి అనే రేంజ్ లోకి వెళ్లే ప్లాన్ లో ఉన్నాడు. ఈసారి ఆయన ఫోకస్ మొత్తం పాన్ ఇండియా మార్కెట్ పైనే ఉంది. దానికి తగ్గట్టుగానే అన్నీ ప్లాన్ చేసుకుంటున్నాడు నాని. వాస్తవానికి ఈ చిత్రానికి మార్చి 26న, అనగా వచ్చే నెల 26న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ షూటింగ్ అప్పటికి పూర్తి అవ్వడం అసాధ్యం అవ్వడంతో వాయిదా వేశారు. కొత్త విడుదల తేదీ ఎప్పుడో తెలియదు. కానీ ఎప్పుడొచ్చినా ఈ సినిమా గురించి దేశం మొత్తం మాట్లాడుకోబోతుంది అనే రేంజ్ లో ఉంటుందని నాని చాలా నమ్మకం తో ఉన్నాడు.
గతంలో ఆయన శ్రీకాంత్ ఓదెల తో కలిసి ‘దసరా’ చిత్రం చేసాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. కానీ తెలుగు లో తప్ప ఎక్కడా ఈ చిత్రానికి రెస్పాన్స్ రాలేదు. ఎందుకంటే మేకర్స్ అసలు ప్రొమోషన్స్ విషయం లో పట్టించుకోలేదు. కానీ ‘ది ప్యారడైజ్’ చిత్రానికి మాత్రం అలా చేయడం లేదు . పాన్ ఇండియా లెవెల్ లో నిజంగానే సీరియస్ గా తీసుకున్నారు. అందుకే ఈ సినిమాకు సంబంధించిన హిందీ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని ‘జీ స్టూడియోస్’ కి భారీ రేట్ కి అమ్మేశారు. రీసెంట్ గానే ధురంధర్ చిత్రం తో సెన్సేషన్ క్రియేట్ చేసి మంచి ఊపు మీదున్న ‘జియో స్టూడియోస్’ సంస్థ కొనుగోలు చేసిందంటే, కచ్చితంగా ఈ చిత్రం లో విషయం గట్టిగానే ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు.
బాలీవుడ్ లో ప్రొమోషన్స్ ఒక్కటి చూసుకుంటే చాలు, కంటెంట్ బాగుంటే అక్కడి ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టేస్తారు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తుంటే ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే రెండవ వారం లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే దీనిపై అధికారికంగా క్లారిటీ రానుంది. సీనియర్ హీరో మోహన్ బాబు విలన్ గా నటిస్తున్న ఈ చిత్రం లో కాయదు లోహర్ హీరోయిన్ గా నటించింది. ఇక కామెడీ చేస్తూ పబ్బం గడుపుతున్న సంపూర్ణేష్ బాబు, ఈ చిత్రంలో హీరో నాని కి స్నేహితుడి పాత్రలో కనిపించాడు. అనిరుద్ స్వరపరిచిన మొదటి పాట నాని పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయబోతున్నారు మేకర్స్.