The Paradise Aaya Sher Song: వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) , సరి తన అరీర్ ని ఆరో లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం లో భాగంగా చేస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్'(The Paradise Movie). ‘దసరా’ వంటి భారీ హిట్ తర్వాత శ్రీకాంత్ ఓదెల తో నాని చేస్తున్న రెండవ సినిమా కావడం , దానికి తోడు గ్లింప్స్ వీడియో కూడా చాలా కొత్తగా ఉండడం తో ఈ సినిమాపై మార్కెట్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా గ్లింప్స్ వీడియో లో నిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ ముస్కి కి యూత్ ఆడియన్స్ ఊగిపోయారు. రేపు ఈ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉన్న ‘ఆయా షేర్’ పాటని విడుదల చేయబోతున్నారు . ఈ సందర్భంగా మేకర్స్ కాసేపటి క్రితమే ఈ సాంగ్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు.
సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యే రేంజ్ ప్రోమో ని వదులుతారు , బాగా వైరల్ అవ్వుధి అని నాని ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకుంటే , వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. గ్లింప్స్ లో చూపించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బీట్ తప్ప , సాంగ్ మొత్తం చాలా రొటీన్ గా ఉంది. అనిరుద్ నుండి ఇలాంటి పాటలు అసలు ఊహించలేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు . కొంతమంది అయితే నిజంగా ఈ పాటని అనిరుద్ కంపోజ్ చేశాడా ?, లేదా సమయం సరిపోక తన అసిస్టెంట్స్ తో చేయించాడా ?, ఇలా ఉందేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కేవలం ప్రోమో ని చూసి ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు , పూర్తి పాట వచ్చే వరకు ఆగాలి అంటూ కొంతమంది నాని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
చూడాలి మరి పూర్తి పాట ఎలా ఉండబోతుంది అనేది. వరుసగా మ్యూజిక్ లెజెండ్స్ నుండి అవుట్ డేటెడ్ సాంగ్స్ రావడం మ్యూజిక్ లవర్స్ ని తీవ్రమైన నిరాశకు గురి చేసింది. నిన్న దేవి శ్రీ ప్రసాద్ స్వరపర్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లోని ‘#AuraOfUstaad’ పాటకు కూడా ఫ్యాన్స్ నుండి ఇలాంటి రియాక్షనే వచ్చింది . కనీసం అనిరుద్ అయినా అదరగొడుతాడు అనుకుంటే ఈయన ఇంకా పెద్ద రాడ్ గుచ్చాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కంటెంట్స్ వదిలితే ఇప్పటి వరకు ‘ది ప్యారడైజ్ ‘ చిత్రం పై ఏర్పడిన బజ్ మొత్తం నాశనం అయ్యే అవకాశం ఉంటుందని , చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ ప్రోమో ని మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
I don’t have an address.
I will become the address. #AayaSher
24/2/2026#TheParadise @anirudhofficial x @odela_srikanth pic.twitter.com/LZp0C1N9FB— Nani (@NameisNani) February 23, 2026