Natural Star Nani: సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు నాని. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి హిట్లు, ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు ఎమోషనల్, కామెడీ సినిమాలు ఎక్కువగా చేసిన త్వరలోనే పూర్తిస్థాయి యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని నటించిన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. అయితే తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ను చిత్ర బృందం ప్రకటించింది.

కాగా ఈ మూవీ టీజర్ విడుదల తేదీని మూవీ మేకర్స్ తాజాగా ప్రకటించారు. చిత్ర టీజర్‌ని నవంబర్ 18వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. నాని సరసన సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన రైజ్ ఆఫ్ శ్యామ్ మంచి స్పందనను అందుకున్న విషయం తెలిసిందే. ఈ అప్డేట్ తో మూవీ పై అంచనాలు భారీగా పెరిగాయి.
TEASER
November 18th #ShyamSinghaRoy 🔥 pic.twitter.com/RW4Mkr3P3A— Nani (@NameisNani) November 11, 2021
ఈ పోస్టర్‌లో నాని తన చేతిలో మండుతున్న కర్రను పట్టుకుని ఉన్నారు. నిప్పు కణికలతో పోస్టర్ పవర్ ఫుల్‌గా ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటే టీజర్ ఎంతో హై ఇంటెన్స్‌తో ఉండబోతోందనేది అర్థమవుతుంది. కాగా, ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించగా… మెలోడి స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 24న ఈ చిత్రం విడుదల కానున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాతో అయిన గట్టి హిట్ కొట్టాలని నాని భావిస్తున్నాడు.