Nani Reject Films: ‘అష్టచమ్మా’ సినిమాతో హీరోగా తన కెరియర్ ను స్టార్ట్ చేసిన నాని ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో మంచి విజయాలను సాధిస్తూ వచ్చాడు. ఒక్కో స్టెప్ పైకి ఎదుగుతూ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా పేరును సంపాదించుకున్నాడు. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేస్తున్న ప్యారడైజ్ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక నాని తన కెరీర్లో మంచి సినిమాలు చేసి ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ కి కనెక్ట్ అయ్యాడు. అందువల్లే అతన్ని ప్రతి ఒక్కరు తన ఫ్యామిలీ మెంబర్ గా చూస్తుంటారు. అలాంటి నాని కొన్ని సక్సెస్ ఫుల్ సినిమాలను కూడా రిజెక్ట్ చేశారనే విషయం మనలో చాలామందికి తెలియదు…
నితిన్ హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇష్క్’ సినిమా కథని మొదట నాని కే వినిప్పించారట. కానీ నాని అప్పుడు వేరే ప్రాజెక్ట్స్ లో ఉండి ఆ సినిమాని రిజెక్ట్ చేశాడు… శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వచ్చిన ‘భలే మంచి రోజు’ సినిమా కథను సైతం మొదట నానికి చెప్పారట. అయినప్పటికి నాని ఆ సినిమాని రిజెక్ట్ చేశాడు.
హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సన్మాని హీరోగా వచ్చిన ‘సీతారామం’ సినిమా స్టోరీని నానికి వినిపించినప్పటికి దర్శకుడి మీద నానికి పెద్దగా నమ్మకం లేకపోవడంతో ఆ కథను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది…ఇక వెంకీ అట్లూరి డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన ‘లక్కీ భాస్కర్’ సినిమాని సైతం మొదట నాని కోసమే అనుకున్నారట.
కానీ నాని ఆ కథలో కొన్ని మార్పులు చేర్పులు అడగడంతో దుల్కర్ సల్మాన్ తో సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు… ప్రస్తుతం నాని ఉన్న పొజిషన్ కి ఆయన ఈ సినిమాలు చేసి ఉంటే ఇప్పుడు ఆయన కెరియర్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది అంటూ మరికొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…