Homeఎంటర్టైన్మెంట్Nani : నాని మొదటి సంపాదన ఎంతో తెలుసా? పాపం అది కూడా చేతికి రాలేదు!

Nani : నాని మొదటి సంపాదన ఎంతో తెలుసా? పాపం అది కూడా చేతికి రాలేదు!

Nani : ఎవరి జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందో చెప్పలేం. నాని డైరెక్టర్ కావాలని పరిశ్రమకు వచ్చాడు. మొదట్లో ఆయన క్లాప్ అసిస్టెంట్ కూడా చేశాడట. అనంతరం రాధా గోపాలం, అస్త్రం, అల్లరి బుల్లోడు, ఢీ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు. కాగా క్లాప్ అసిస్టెంట్ గా నానికి రూ. 2500 ఇచ్చారట. ఆ మొత్తాన్ని చెక్ రూపంలో ఇవ్వడంతో, నాని ఆ చెక్ అందరికీ చూపిస్తూ రోజులు గడిపాడట. కట్ చేస్తే ఆ నిర్మాణ సంస్థ వేరే బ్యాంకు కి మారడంతో చెక్ బౌన్స్ అయ్యిందట. ఇక చేసేది లేక ఆ చెక్ ని దాచి పెట్టుకున్నాడట.

Also Read : ఈ కుర్రాడు ప్రస్తుతం మాస్ ఆడియన్స్ ఫేవరెట్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా…

ఇక అసిస్టెంట్ డైరెక్టర్ గా నానికి నెలకు రూ. 4000 ఇచ్చేవారట. మొదటి నెల జీతం పది రూపాయల నోట్ల కట్టల్లో ఇచ్చారట. ఆ నోట్ల కట్టలు జేబులో పెట్టుకుని హైదరాబాద్ కి నవాబు తానే అన్నట్లు ఫీల్ అయ్యాడట. ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పార్టీ ఇచ్చాడట. ఆ తర్వాత రెండు నెలల జీతం దాచి తన పేరెంట్స్ కి ఉంగరాలు చేయించాడట. పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఎదురైన అనుభవాలు నాని తాజాగా నెమరు వేసుకున్నాడు. నాని అష్టా చెమ్మా మూవీతో హీరోగా మారాడు. స్నేహితుడు, అలా మొదలైంది, భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమిందార్, ఈగ చిత్రాలు హీరోగా నిలబెట్టాయి.

టైర్ టు హీరోల్లో టాప్ పొజిషన్ లో నాని ఉన్నాడు. విలక్షణమైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ నాని ముందుకు వెళుతున్నాడు. ఒకప్పుడు కేవలం రెండు వేల రూపాయలకు పని చేసిన నాని, ప్రస్తుతం ఇరవై కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఆయన నటించిన హిట్ 3 చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆయన మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. శైలేష్ కొలను హిట్ 3 చిత్రాన్ని తెరకెక్కించారు. నాని స్వయంగా నిర్మించాడు. హిట్ 3 మూవీలో నానికి జంటగా కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తుంది. నాని కెరీర్లో మోస్ట్ వైలెంట్ మూవీగా హిట్ 3 తెరకెక్కింది.

నెక్స్ట్ నాని పారడైజ్ టైటిల్ తో మూవీ చేస్తున్నాడు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకుడు. ఫస్ట్ లుక్, గ్లిమ్ప్స్ తో పారడైజ్ చిత్రం పై అంచనాలు పెరిగిపోయాయి.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ‘హిట్ 3’ అడ్వాన్స్ బుకింగ్స్..ట్రెండ్ ఎలా ఉందంటే!

RELATED ARTICLES

Most Popular