Nani and Roshan : నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నటుడిగా మాత్రమే కాకుండా, నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఆ!’, ‘హిట్’, ‘హిట్ 2’ వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన నాని, ఇప్పుడు ‘కోర్ట్'(Court Movie) అనే చిత్రాన్ని నిర్మించాడు. సమాజం లోని సున్నితమైన అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ జగదీశ్. నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో థియేట్రికల్ ట్రైలర్ ని కూడా విడుదల చేసారు. ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ ని చూస్తుంటే ఒక మేజర్ అబ్బాయి, ఒక మైనర్ అమ్మాయికి మధ్య జరిగే లవ్ స్టోరీ, దాని వల్ల ఎదురయ్యే పరిణామాలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన సినిమాగా అర్థం అవుతుంది. ఈ చిత్రం లో హీరోగా హర్ష రోషన్(Harsh Roshan) నటించాడు.
Also Read : నాని ఊర మాస్ సినిమాలు చేయడం వెనక అసలు కారణం ఇదేనా..?
హర్ష రోషన్ బాలనటుడిగా మిషన్ ఇంపాజిబుల్, సలార్, సరిపోదా శనివారం, ఫలక్ నూమా దాస్, ముఖ చిత్రం, హ్యాపీ ఎండింగ్, ఇలా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ట్రైలర్ ని చూసిన తర్వాత ఇందులో రోషన్ యాక్టింగ్ అదరగొట్టేసాడని అర్థం అవుతుంది. ఇదంతా పక్కన పెడితే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రోషన్ నాని గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఆయన మాట్లాడుతూ ‘నాకు ఈ సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్ అన్నా. మీ గురించి మాట్లాడుతూనే ఎమోషనల్ అయిపోతున్నాను. మీరు పక్కన ఉంటే నా సొంత అన్నయ్య, నా పక్కనే నిల్చున్నాడు అనే భయం, గౌరవం ఉంటుంది. సరిపోదా శనివారం చిత్రం లో మీ పక్కనే నేను నటించాను. నాకు ఆ తర్వాత వెంటనే ‘కోర్ట్’ సినిమాలో ఇంత మంచి క్యారక్టర్ చేసే అవకాశం ఇచ్చారు’ అంటూ చాలా ఎమోషనల్ అయిపోతాడు.
అప్పుడు నాని స్టేజి మీదకు వచ్చి, రోషన్ ని కౌగలించుకొని వెళ్తాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ చివర్లో నాని మాట్లాడిన మాటలు కూడా బాగా వైరల్ అయ్యాయి. కోర్టు సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని, ఈ సినిమా నచ్చకపోతే, నా ‘హిట్ 3’ చిత్రాన్ని చూడడం ఆపేయండి అంటూ ఆయన మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. దీనిని బట్టి ఈ సినిమా కంటెంట్ పట్ల నాని కి ఎంత బలమైన నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సున్నితమైన అంశాలను తీసుకున్నప్పుడు, స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ గా ఉంటే, బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు క్రియేట్ అవుతాయి. ఈ సినిమాకి కూడా అలాంటి అద్భుతమే జరగబోతుంది అంటూ అభిమానులు బలమైన నమ్మకం తో ఉన్నారు. మరి మార్చి 14 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా, ఆ నమ్మకాన్ని నిజం చేస్తుందా లేదా అనేది చూడాలి.
Also Read : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ కి చుక్కలు చూపనున్న నేచురల్ స్టార్ నాని ‘పారడైజ్’ చిత్రం?