Jersey: నాని హీరోగా క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన జెర్సీ సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఇప్పుడు ఈ సినిమా రీమేక్‌గా షాహిద్ కపూర్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో హిందీలో రూపొందిస్తున్నారు. ఇక్కడ కూడా జెర్సీ అనే టైటిల్ పెట్టారు. తాజాగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా కనిపించనున్న ఈ సినిమా మేకింగ్ వీడియో విడుదలైంది. ఈ సినిమాకు దిల్‌రాజు, సూర్య దేవర నాగ వంశీ, అమన్ గిల్ సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా రానుంది.
కాగా, హిందీ జెర్సీ ట్రైలర్‌పై నేచురల్ స్టార్ నాని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. హిందిలో జెర్సీ ట్రైలర్ తనకు నచ్చిందని అన్నారు. సినిమాలో సోల్ మిస్ కాకుండా ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రీమేక్ చిత్రాల్లో భారీ బడ్జెట్ పెట్టి అంతా చక్కగా తెరకెక్కించినా.. ఒరిజినల్ సోల్ మిస్ అవుతూంటుందని.. అయితే, హిందీ జెర్సీ ట్రైలర్ చూస్తే అలా అనిపించడం లేదని అన్నారు. సినిమా విడుదలైతే మంచి హిట్ అవుతుందని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు నాని. డిసెంబరు 31న హిందీ జెర్సీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా, ప్రస్తుతం నాని శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్స్‌లో పుల్ బిజీగా ఉన్నారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబరు 24న విడుదల కానుంది. ఈ సినిమాలో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. మరి ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న నానికి.. ఈ సినిమా మంచి హిట్ అందిస్తుందేమో చూడాలి.