
టాలీవుడ్లో హిట్లు.. ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోల్లో నాని ముందుంటాడు. మిగతా హీరోలంతా ఏడాది ఒకటి అర.. సినిమాలు చేసేందుకు ఇబ్బందులు పడుతుంటే నాని మాత్రం ఏడాది ఈజీగా రెండు.. మూడు సినిమాలు రిలీజు చేస్తుంటాడు. పక్కా ప్రణాళికలతో సినిమాలను పూర్తి చేస్తూ స్టార్ హీరోలందరికీ నాని సవాల్ విసురుతుంటాడు.
Also Read: బాలయ్య బాబుకు విలన్ అతనే !
ఈ ఏడాది కరోనా ఎంట్రీ ఇవ్వడంతో నాని ముందస్తు ప్లాన్ చేసుకున్న సినిమాలన్నీ ఆగిపోయాయి. తాను నటించిన 25వ సినిమా ‘వి’ని థియేటర్లలోనే విడుదల చేయాలని పంతానికి పోకుండా ఓటీటీలో విడుదలకు అంగీకరించాడు. ఈ సినిమా ఓటీటీ ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో నాని నిర్ణయం సరైనదేనని తేలింది.
గతంలోనే నాని ‘వి’ మూవీని మార్చిలో.. జూలైలో ‘టక్ జగదీష్’.. డిసెంబర్లో ‘శ్యామ్ సింగరాయ్’ థియేటర్లలోకి వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు. అయితే కరోనా ఎఫెక్ట్ నాని ప్లానంతా రివర్స్ అయింది. తాజాగా టాలీవుడ్లో షూటింగుల సందడి మొదలుకావడంతో నాని తన సినిమాలన్నీంటిని మళ్లీ లైన్లో పెడుతున్నాడు.
Also Read: లేడీ డైరెక్టర్ అయితే.. గుర్తించరా ?
నాని తొలుత ‘టక్ జగదీష్’ను పూర్తి చేయనున్నాడు. దీనిని ఏప్రిల్ రిలీజు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు పరిస్థితులు చక్కబడుతాయని నాని భావిస్తున్నాడు. దీంతో అప్పటికీ ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ‘శ్యామ్ సింగరాయ్’ మూవీని నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీని డిసెంబర్లో మొదలుపెట్టి జూన్ లేదా జులై నాటికి విడుదల చేసేలా చూసుకుంటున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
వీటితోపాటు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ మూవీని చేసేందుకు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీలో నానికి జోడీగా మలయాళ నటి నాజ్రియా ఫహాద్ నటించనుంది. ‘వి’ మూవీ ఓటీటీ రిలీజు కావడంతో ఆ ప్రభావం నాని సినిమాలపై పెద్దగా పడేలా కన్పించడం లేదు. దీంతో నాని సైతం తన తదుపరి మూవీలతో మంచి హిట్టుకొట్టి మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు.