Nani Birthday Special 2026: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా , ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం నుండి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి , అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించి , ఆ తర్వాత ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరో గా మారి , మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకొని , అంచలంచలుగా ఎదుగుతూ నేడు నేచురల్ స్టార్ నాని(Natural Star Nani), ఏ స్థాయి వరకు వచ్చాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. నెపోటిజం రాజ్యం ఏలుతున్న ఈ రోజుల్లో , సామాన్యులకు ఇండస్ట్రీ లో చోటు దక్కడం అసాధ్యం అనే మాటలకు నాని చెక్ పెట్టాడు. టాలెంట్ , లక్ కలిసొస్తే ఎంత ఎత్తుకి అయినా ఎదగొచ్చు అని నిరూపించి తనలాంటి ఔత్సాహికులకు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టే ఆశని కల్పించాడు నాని. ఇది సాధారణమైన విషయం కాదు.
నాని కెరీర్ ని ఒకసారి చూసుకుంటే ‘దసరా’ కి ముందు , ఆ తర్వాత అని డివైడ్ చేయొచ్చు. ‘దసరా’ చిత్రానికి ముందు వరకు కూడా నాని మార్కెట్ చాలా మీడియం రేంజ్ లో ఉండేది. పాతిక నుండి 30 కోట్ల రూపాయిల బిసినెస్ మాత్రమే ఆయన సినిమాలకు ఉండేది. కానీ ‘దసరా’ చిత్రం తో కెరీర్ లో మొదటిసారి భారీ బడ్జెట్ ని పెట్టి , తన రేంజ్ ని పెంచుకునే ప్రయత్నం చేసాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఆ చిత్రం తో మొదటిసారి అరీర్ లో వంద కోట్ల గ్రాస్ సినిమాని అందుకున్న ఆయన , ఆ తర్వాత ‘హాయ్ నాన్న ‘, ‘సరిపోదా శనివారం ‘, ‘హిట్ 3’ చిత్రాలు చేసి మరో రెండు సార్లు వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకున్నాడు. ఇప్పుడు ‘దసరా ‘ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తో ‘ది ప్యారడైజ్’ వంటి ప్రెస్టీజియస్ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా పై ఆడియన్స్ లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు ఆగస్టు 23 న ఈ చిత్రానికి వచ్చే వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ ని చూసి ట్రేడ్ మొత్తం ఆశ్చర్యపోబోతుంది అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా తో నాని ఈ ఏడాది స్టార్ హీరోల లీగ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటున్నారు. ఆడియన్స్ నుండి ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కచ్చితంగా 300 కోట్ల మార్కుని అందుకుంటుందని అంటున్నారు. మరి ఆ రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది తెలియాలంటే ఆగస్టు 23 వరకు ఆగాల్సిందే .