https://oktelugu.com/

Nani: నాని శ్రీకాంత్ ఓదెల కొత్త మూవీ పోస్టర్ మామూలుగా లేదుగా…ఈ మూవీ బ్యాక్ డ్రాప్ ఏంటంటే..?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోలు వాళ్ళకంటూ సపరేట్ ఐడెంటిటీ కావాలని కోరుకుంటున్నారు. అందువల్లే రొటీన్ సినిమాలను కాకుండా కొత్తగా ఉండే కథలను సెప్సెక్ట్ చేసుకొని సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ ని క్రియేట్ చేసుకుంటున్నారు... ఇక ఏది ఏమైనా కూడా సక్సెసులు దక్కితేనే వాళ్ళు స్టార్ హీరోలుగా ఎదుగుతారు. లేకపోతే మాత్రం ఇక్కడ రాణించడం కష్టమనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : November 8, 2024 / 09:58 PM IST

    Nani(4)

    Follow us on

    Nani: న్యాచురల్ స్టార్ నాని తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటున్నాడు. నిజానికి కెరియర్ మొదట్లో ఆయన సాఫ్ట్ సినిమాలు చేస్తూ ముందుకు సాగాడు. కానీ ప్రస్తుతం మాత్రం తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించుకున్నాడు. ఎప్పుడైతే ఆయన దసర సినిమా చశాడో అప్పటినుంచి ఆయన సినిమా సెలక్షన్ లో భారీగా మార్పులు అయితే వస్తున్నాయి. అంతకుముందు సాఫ్ట్ లవ్ స్టోరీస్ ని చేసుకుంటూ ముందుకు సాగిన నాని ఒక్కసారిగా తన పంథాను మార్చి మాస్ హీరోగా అవతారం ఎత్తాడు… దసరా సినిమాలో చేసిన క్యారెక్టర్ ఫుల్ రగ్గుడ్ గా ఉండడమే కాకుండా ఆయనలోని మాసిజాన్ని కూడా బయటకు తీసింది… ఇక ఏది ఏమైనా కూడా నాని ఇప్పుడు మాస్ హీరోగా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక అందుకే వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో ‘సరిపోదా శనివారం’ సినిమాలో కూడా భారీ యాక్షన్ ను ప్లాన్ చేశారు. ఇక ఇదిలా ఉంటే తమదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఏది ఏమైనా కూడా నాని శ్రీకాంత్ ఓదల కి సెకండ్ ఛాన్స్ ఇవ్వడంతో ట్రేడ్ పండితులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    ఎందుకు అంటే శ్రీకాంత్ ఓదెల దసర సినిమాని సక్సెస్ ఫుల్ గా విజయ తీరాలకు చేర్చాడు. కాబట్టి అతనికి మరొక సినిమా ఇచ్చిన పెద్దగా ప్రమాదమైతే ఏమీ ఉండదని వీళ్ళ కాంబినేషన్ కి భారీ గుర్తింపు అయితే ఉందని, దానివల్లే వీళ్ళ సినిమాలను చూడడానికి ప్రతి ఒక్క ఆడియో థియేటర్ కి వస్తారని చాలామంది విమర్శకులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేయడం విశేషం. ఇక వీళ్ళ కాంబోలో వస్తున్న ప్యారడైజ్ సినిమా ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉంది…అలాగే ఇది గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడం విశేషం…

    ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న నాని ఆ తర్వాత కూడా మాస్ సినిమాలనే చేయడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఎందుకు నానిలో ఇంత వేరియేషన్ వచ్చింది అంటూ చాలామంది ప్రశ్నించగా దానికి కారణం స్టార్ హీరోగా ఎదగాలంటే ఎంతో కొంత మాస్ ఇమేజ్ అనేది ఉండాలి.

    కాబట్టి ఆయన మాస్ సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు… ఇక కారణం ఏదైనా కూడా మంచి సినిమాలు చేస్తే మాత్రం ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే ఉద్దేశ్యంతోనే ఆయన మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు…