Nani and Srikanth Odela : సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే అంత ఆషామాషి వ్యవహరమైతే కాదు. దర్శకుడు తను చేస్తున్న ప్రతి పనిని చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు సాగితేనే సక్సెస్ లు అయితే వస్తుంటాయి… మరి ఏది ఏమైనా కూడా ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా కీలక పాత్ర వహించాల్సిన అవసరమైతే ఉంది. ఒక సినిమా మ్యూజిక్ గాని, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గాని అద్భుతంగా ఉంటేనే ఈరోజుల్లో సినిమాలు సూపర్ సక్సెస్ లుగా నిలుస్తున్నాయి…
శ్రీకాంత్ ఓదెల(Srikanth ఓదెల), నాని (Nani) కాంబినేషన్ లో వచ్చిన దసర (Dasara) సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక అదే బాటలో మరోసారి వీళ్ళ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. అయితే ప్యారడైజ్ పేరుతో తెరకెక్కబోయే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ను తీసుకున్నారు. నిజానికి దసర సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ను తీసుకోవాల్సింది. కానీ అప్పుడున్న పరిస్థితులను బట్టి ఆయన్ని కాకుండా సంతోష్ నారాయనన్ (Santhosh Narayanan) తీసుకున్నారు. అయితే ఇప్పుడు అనిరుధ్ ను తీసుకోవడం వల్ల సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది అంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. నిజానికి నాని విక్రమ్ కే కుమార్ (Vikram K Kumar)దర్శకత్వంలో చేసిన గ్యాంగ్ లీడర్ (Gang Leader) సినిమాకి కూడా అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. ఆ సినిమాలో ఒకటి రెండు సాంగ్స్ ను మినహాయిస్తే మిగిలిన సాంగ్స్ ఏవి అంత పెద్దగా పాపులారిటిని సంపాదించుకోలేదు. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం వల్ల ఈ సినిమాకి పెద్దగా ప్లస్ అయ్యే అవకాశాలైతే ఏమీ కనిపించడం లేదు. ఇక అనిరుధ్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అజ్ఞాతవాసి, ఎన్టీఆర్ దేవర సినిమాలకు కూడా మ్యూజిక్ డైరక్టర్ గా వ్యవహరించాడు. ఇక ఈ సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.
కాబట్టి అనిరుధ్ కి తెలుగులో అంత మంచి మార్కెట్ అయితే లేదు. తన పాటలకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్న విషయం కానీ స్ట్రైట్ తెలుగు సినిమాలను చేయడంలో అనిరుధ్ చాలావరకు సక్సెస్ లను సాధించడంలో వెనుకబడిపోయాడనే చెప్పాలి.
మరి ఇలాంటి సందర్భంలో నాని, శ్రీకాంత్ ఓదెల అతన్ని పట్టుబట్టి మరి తీసుకోవడం వెనక కారణమేంటి ఆయన మ్యూజిక్ తో మరోసారి మ్యాజిక్ చేయగలరా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తేనే శ్రీకాంత్ ఓదెల తను తదుపరి చేయాల్సిన చిరంజీవి సినిమా మీద మంచి హైప్ అయితే క్రియేట్ అవుతుంది.
ఒకవేళ ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోతే మాత్రం చిరంజీవి సినిమా మీద హైప్ అయితే భారీ రేంజ్ లో తగ్గే అవకాశాలు ఉన్నాయి. మరి ఏది ఏమైనా కూడా శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకుడు ఇప్పుడు తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన సమయమైతే వచ్చింది. మరి ఈ సమయాన్ని తను బాగా వాడుకుంటే మాత్రం స్టార్ట్ డైరెక్టర్ గా ఎలివేట్ అవుతాడు. లేకపోతే మాత్రం మళ్ళీ పాతాళానికి పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు…