Tandel : నాగచైతన్య(Naga Chaithanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన తండేల్ (Thandel) సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది. ఈ సినిమాతో నాగ చైతన్య(Naga Chaithanya) సూపర్ సక్సెస్ ని సాధిస్తే స్టార్ హీరో రేంజ్ లోకి వెళ్తాడు. లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ భారీగా డౌన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమా 80 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఆయనకి అంత మంచి మార్కెట్ అయితే లేదు. కానీ కంటెంట్ ను నమ్మి గీతా ఆర్ట్స్ అధినేత అయిన అల్లు అరవింద్ సినిమా మీద భారీగా ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో అయిన సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఇక ఇండస్ట్రీలో అతనికి తిరుగు ఉండదనే చెప్పాలి. తండేల్ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో నాగచైతన్య భారీ సక్సెస్ ని సాధిస్తాడు అంటూ ఇప్పటికే సినిమా మీద మంచి హైప్ అయితే పెంచేస్తున్నారు. ప్రమోషన్ల విషయంలో చాలావరకు ముందంజలో ఉంటున్న సినిమా సెలబ్రిటీలు సైతం ఈ సినిమా కోసం విపరీతమైన కసరత్తులు చేస్తూ ప్రమోషన్స్ భారీ రేంజ్ లో చేపడుతున్నారు… ఇక్కడి వరకు బాగానే ఉంది.
కానీ ఈ సినిమా క్లైమాక్స్ లో నాగచైతన్య, సాయి పల్లవి ఇద్దరు చనిపోతారు అంటూ ఒక వార్త అయితే సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది. నిజానికి ప్రేమ కథ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఆ నేపధ్యం లోనే వీళ్లిద్దరూ మరణిస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా చివర్లో వీళ్లిద్దరూ చనిపోతే సినిమా ఎలా ఉండబోతుందనే వార్తలు కూడా వెలువడుతున్నాయి.
మరి వీళ్లిద్దరు నిజంగానే చనిపోతున్నారా? లేదంటే అటెన్షన్ కోసం అలాంటి ఒక న్యూస్ ని క్రియేట్ చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీ విని ఎరుగని రీతిలో నాగచైతన్య భారీ సక్సెస్ ని సాధించడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది… ఇక దర్శకుడు చందు మొండేటి సైతం ఈ సినిమా మీద మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. ఈ సినిమా సక్సెస్ అయిన వెంటనే తను సూర్యతో మరో సినిమా అనౌన్స్ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు.
మరి ఏది ఏమైనా కూడా చందు మొండేటి లాంటి యంగ్ డైరెక్టర్ ‘కార్తీకేయ 2’ సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్నాడు. ఇక ఈ సినిమాతో కూడా మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకొని తన స్కేలు పెంచుకొని సూర్యతో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…