https://oktelugu.com/

Geetha Madhuri: సింగర్‌ గీతామాధురి ద్వారా కూతురుకూ ఆ వ్యాధి.. షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన నందు!

సింగర్‌ గీతా మాధురి, నటుడు నందు భార్యా భర్తలు అని వారిద్దరూ ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించుకుని మరీ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీక ఓ పాపు కూడా పుట్టింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 22, 2023 / 06:56 PM IST

    Geetha Madhuri

    Follow us on

    Geetha Madhuri: సింగర్‌ గీతా మాధురి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధ్భుతమైన గాత్రంతో అందరినీ అలరించగల సత్తా ఉన్న ఈమె.. ఇప్పటికీ స్టార్‌ సింగర్‌ గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఎన్నెన్నో అద్భుతమైన సినిమాలకు పాటలు పాడుతూ తన కెరియర్‌ ను కొనసాగిస్తోంది. 2008లో వచ్చిన నచ్చావులే సినిమాకు గాత్రదానం అందజేసి.. విపరీతమైన క్రేజ్‌ సంపాధించుకుంది. ఆ తర్వాత వరుసగా పాటలు పాడుతూనే వస్తోంది. కెరియర్‌ పరంగా అద్భతమైన లైఫ్‌ను ఆనందిస్తున్న ఈమె.. పర్సనల్‌ లైఫ్‌లోనూ చాలా హ్యాపీగానే ఉంది.

    నటుడితో ప్రేమ వివాహం..
    సింగర్‌ గీతా మాధురి, నటుడు నందు భార్యా భర్తలు అని వారిద్దరూ ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించుకుని మరీ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీక ఓ పాపు కూడా పుట్టింది. అయితే ఆ పాపకు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. పాప పుట్టిన తర్వాత వీరిద్దరి మధ్య చాలానే మనస్పర్థలు వచ్చాయని, విడాకులు కూడా తీసుకుబోతున్నారంటూ ప్రచారం సాగింది. కానీ అదంతా అవాస్తవం అని చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు ఈ జంట. అయినా అప్పుడప్పుడూ అలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి.

    మళ్లీ ప్రెగ్నెంట్‌తో రూమర్స్‌కు చెక్‌..
    ఇక రూమర్స్‌కు చెక్‌ పెడుతూ సింగర్‌ గీతా మాధురి ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తాను రెండో సారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా తన చిట్టితల్లి దాక్షాయణి ప్రకృతి అక్క కాబోతుందంటూ పేర్కొంది. ఈ ఒక్క గుడ్‌ న్యూస్‌తో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తకు గట్టిగా సమాధానం చెప్పింది. తాజాగా గీతా మాధురి భర్త నందు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో గీతా మాధురి గురించి, తమ బంధం గురించి, తమ కూతురు గురించి చాలా విషయాలు చెప్పి అందరికీ షాకిచ్చాడు.

    క్యాసినే అంటే పిచ్చట..
    సింగర్‌ గీతా మాధురికి క్యాసినోవా అంటే పిచ్చి అని చెప్పుకొచ్చాడు. ఎక్కడికైనా వెళ్లామంటే కచ్చితంగా ఆడుతుందని.. అలా చాలా డబ్బులు పోగొట్టేసిందని నందు తెలిపాడు. మరీ కోట్లు, కోట్లు పోగొట్టిందా అని అడిగితే అదేం లేదు.. చిన్న మొత్తంలోనే అంటూ ఓ రెండు, మూడు ఫోన్లు కొనుక్కునేంత అయితే పోగొట్టిందని క్లారిటీ ఇచ్చాడు. తను తరచుగా అలా చేస్తూ డబ్బులు పోగొట్టడం తనకు నచ్చక గట్టిగా చెప్పానని.. అప్పటి నుంచి గీతా మాధురి క్యాసినో ఆడడం మానేసిందని వెల్లడించాడు.

    ఆ సమస్యతో ఇబ్బంది..
    ఇక తన భార్యకు ఓ సమస్య ఉందని తెలిపాడు. తాను ఎంత కోపంగా మాట్లాడినా అంటే తిట్టినా, కొట్టినా నవ్వుతూ మాట్లాడుతుందని చెప్పాడు. అలాగే గీతా చేసే విధంగానే తన కూతురు దాక్షాయణి ప్రకృతి కూడా చేస్తోందని… ఏడ్వడానికి బదులుగా నవ్వేస్తుందని పేర్కొన్నాడు. అసలు ఇదేంటని తన భార్య గీతా మాధురిని అడిగితే.. నువ్వు ఏమన్నా నీ మొహం చూస్తే నాకు నవ్వొస్తుందని బుజ్జీ అంటూ తెలిపిందని… తన కూతురు కూడా అచ్చం తన అమ్మాలాగే ప్రవర్తిస్తుందని పేర్కొన్నాడు.