వెండితెర పై రాణించలేకపోయిన ‘హాట్ బ్యూటీ నందినీ రాయ్’ డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద మాత్రం గ్యాప్ లేకుండా వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా నందినీ రాయ్ “ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్” వెబ్ సిరీస్ లో నటించింది. అయితే, ఈ సిరీస్ లో ఒక సీన్ కోసం చెంపలు వాచిపోయేలా కొట్టుకున్నామని చెబుతుంది.
ఆమె మాటల్లోనే.. ‘ఈ సినిమాలో ఒక సీన్ లో నేను, మరో పాత్రధారి వికాస్ కొట్టుకోవాలి. ఒకరినొకరం కొట్టుకునే షాట్ చాలా సహజంగా రావాలని డైరెక్టర్ కండిషన్ పెట్టాడు. అయితే, వికాస్ నన్ను కొట్టడానికి ఇష్టపడట్లేదు. ఏదో పైపైన కొట్టి సరిపెట్టేవాడు. దాంతో ఆ షాట్ అంత బాగా వచ్చేది కాదు. అప్పటికే చాల సేపు అయింది. ఎన్ని సార్లు చేసినా దర్శకుడు సంతృప్తిగా లేడు.
దీంతో మేమిద్దం ఓ అండర్ స్టాండింగ్ కు వచ్చాం. ఈ షాట్ బాగా రావాలంటే.. నిజంగానే మనం చెంపలు వాచిపోయేలా కొట్టుకుందాం అంటూ నేను వికాస్ ను ఒప్పించాను. షాట్ మొదలు అవగానే నేను, వికాస్ ను కసితో లాగి పెట్టి కొట్టాను. అతను కూడా నన్ను కోపంగా కొట్టాడు. మేం అలా బలంగా కొట్టుకోవడంతో ఆ షాట్ చాల సహజంగా వచ్చింది, అలాగే అద్భుతంగా కూడా వచ్చింది.
కాకపోతే మా చెంపలు మాత్రం వాచిపోయాయి’ అంటూ నందినీ రాయ్ నవ్వుతు చెప్పుకొచ్చింది. నందినీ రాయ్ మొదటి నుండి సినిమా కోసం ఏమైనా చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఆమె గొప్ప నటి కాకపోయినా, గొప్ప తపన ఉన్న నటి అని ఆమెకు ఇండస్ట్రీలో మంచి పేరు కూడా ఉంది. అందుకే వెండితెర పై కూడా నందినీ రాయ్ రాణించాలని ఆశిద్దాం.
ఇక ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ “ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్” సిరీస్‌లో నందినీ పక్కా పల్లెటూరి పడుచు పిల్లగా అలరించబోతుంది. నటన మీద ఉన్న ఆసక్తితో ఊరి నుంచి పట్నంకు వెళ్లిన అమ్మాయిలా ఆమె మెప్పించనుంది. అన్నట్టు ఈ సిరీస్ ఆహాలో ప్రసారమవుతోంది.