https://oktelugu.com/

బన్నీ ‘పుష్ప’ పై క్రేజీ రూమర్ !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో నందమూరి తారక రత్న నటించబోతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. మొదట ఈ సినిమాలో తమిళ హీరో విజయ్‌ సేతుపతి ఓ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించాలి. విజయ్ కూడా ఆ పోలీస్ పాత్రలో నటిస్తా అని కమిట్ అయ్యాడు. కానీ కరోనా కారణంగా షెడ్యూల్స్ అన్ని మిస్ అయి.. డేట్స్ అన్ని క్రాస్ అయి మొత్తానికి విజయ్ […]

Written By:
  • admin
  • , Updated On : September 29, 2020 / 05:58 PM IST
    Follow us on


    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో నందమూరి తారక రత్న నటించబోతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. మొదట ఈ సినిమాలో తమిళ హీరో విజయ్‌ సేతుపతి ఓ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించాలి. విజయ్ కూడా ఆ పోలీస్ పాత్రలో నటిస్తా అని కమిట్ అయ్యాడు. కానీ కరోనా కారణంగా షెడ్యూల్స్ అన్ని మిస్ అయి.. డేట్స్ అన్ని క్రాస్ అయి మొత్తానికి విజయ్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ పాత్రలోనే నందమూరి తారకరత్నను తీసుకోవాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. అలాగే రీసెంట్ గా ఈ పోలీస్ పాత్రలో మరో తమిళ్ హీరో ఆర్యను తీసుకోనున్నారని కూడా వార్తలు వచ్చాయి.

    Also Read: రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ పై అనుకోని ట్విస్ట్?

    పైగా ఆర్య గతంలో బన్నీ వరుడు సినిమాలో మెయిన్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ ను గత నెలలోనే స్టార్ట్ చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కరోనా కారణంగా షూట్ స్టార్ట్ చేసే అవకాశం దొరకలేదు. అయితే ఇక ఎట్టిపరిస్థితుల్లో నవంబర్ రెండో వారం నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేయాలని.. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా సాధ్యమైనంత తక్కువమంది స‌భ్యుల‌తో షూట్ స్టార్ట్ చేసి.. రెండు వారాల అనంతరం బన్నీ పై షూట్ స్టార్ట్ చేస్తారట. ముందుగా బన్నీ – రష్మిక పై ఓ రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేస్తారట. అలాగే ఈ సాంగ్ తరువాత ఓ స్పెషల్‌ సాంగ్‌ షూట్ ను కూడా పూర్తి చేస్తారట.

    Also Read: వైరల్ పిక్స్: ‘స్నేహ’తో అల్లు అర్జున్ సెలబ్రేషన్స్..!

    కాగా ఈ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలా నటిస్తోంది. అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ సినిమాలో ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకుంది రష్మిక. ఇప్పుడు పుష్ప సినిమా కూడా హిట్ అయితే ఇక రష్మిక కెరీర్ పీక్ కి వెళ్లడం ఖాయం. స్టార్ హీరోల సినిమాల్లో మరిన్ని అవకాశాలు వస్తాయి. పుష్ప సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. అన్నట్టు షూట్ లో పాల్గొనబోయే స‌భ్యులంద‌రికీ వచ్చే వారం కరోనా టెస్ట్ చేసి, వారికీ కరోనా సోకే అవకాశం లేకుండా టీమ్ అందర్నీ జన సాంద్రతకు దూరమైన ప్రాంతానికి తరలించాలని టీమ్ భావిస్తోంది.