Nandamuri Mokshagna: పవన్ కళ్యాణ్ పాత సినిమాలకు ఎంత మంచి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీ రిలీజ్ సమయంలో ఆ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన రికార్డ్స్ అందుకు సాక్ష్యం. ఆరోజుల్లోనే ఆయన మూడు జెనెరేషన్స్ ని కవర్ చేసే సినిమాలను తీసాడు. ఇప్పటికీ ఆ చిత్రాలు టీవీ టెలికాస్ట్ అయ్యినప్పుడు మంచి టీఆర్ఫీ రేటింగ్స్ వస్తుంటాయి. ముఖ్యంగా ఆయన సినిమాల్లోని పాటలు ఎంతో అద్భుతంగా ఉండేవి. ఈ పాటలను నేటి తరం హీరోలు కొంతమంది రీమిక్స్ చేసారు. అంతే కాదు ఆ సినిమా టైటిల్స్ ని కూడా ఈ జనరేషన్ హీరోలు తెగ వాడేస్తున్నారు. ఇప్పటికే ‘తొలిప్రేమ’ టైటిల్ ని వరుణ్ తేజ్ వాడి పెద్ద హిట్ కొట్టాడు. అదే విధంగా విజయ్ దేవరకొండ ‘ఖుషి’ మూవీ టైటిల్ ని వాడుకున్నాడు. ఈ సినిమా కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడింది కానీ, ఈ సినిమాలోని పాటలు పెద్ద హిట్ అయ్యాయి.
త్వరలో పవన్ కళ్యాణ్ చిత్రాల్లో క్లాసిక్ గా నిల్చిన ‘తమ్ముడు’ మూవీ టైటిల్ తో హీరో నితిన్ సినిమా రాబోతుంది. ఈ చిత్రానికి వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహించాడు. ఇక ప్రముఖ యాంకర్ ప్రదీప్ కూడా పవన్ కళ్యాణ్ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ టైటిల్ ని తన కొత్త సినిమా కోసం వాడేసుకున్నాడు. అంతే కాదు ఆయన సినిమాల్లోని పాటలకు సంబంధించిన చిన్న లిరిక్స్ ని కూడా టైటిల్స్ గా వాడేసుకుంటున్నారు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘కెవ్వు కేక’ చిత్రాలు అందుకు ఉదాహరణ. ఇలా పవన్ కళ్యాణ్ సినిమాల టైటిల్స్ మొత్తాన్ని యంగ్ జనరేషన్ హీరోలు వాడేస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి బాలయ్య కుమారుడు నందమూరి మోక్షజ్ఞ తేజ కూడా చేరిపోయాడని తెలుస్తుంది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
మోక్షజ్ఞ మొదటి సినిమా ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మోక్షజ్ఞ చేయబోయే రెండవ సినిమా కూడా ఫిక్స్ అయిపోయింది. ఈ సినిమా లవ్ స్టోరీ జానర్ లో తెరకెక్కబోతుందని, ఈ సినిమాకి టైటిల్ కూడా పవన్ కళ్యాణ్ పాత చిత్రానికి సంబంధించినది అని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పాత సినిమా టైటిల్స్ అంటే ఇక కేవలం బద్రి, సుస్వాగతం, గోకులం లో సీత టైటిల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవి కాకుండా గబ్బర్ సింగ్ చిత్రానికి ముందు వచ్చిన సినిమాలు కూడా పాత సినిమాల క్యాటగిరీలోకే వస్తాయి. మరి ఏ టైటిల్ ని పెట్టబోతున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు, మా అకిరా నందన్ కి కనీసం ఒక్క టైటిల్ ని అయినా మిగిలించండి అంటూ సోషల్ మీడియా లో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.