Nandamuri Kalyan Ram AMIGOS: డిఫరెంట్ కథలతో పాటు.. వైవిధ్యమైన లుక్స్ తో అదరగొడుతున్న కళ్యాణ్ రామ్ లేటేస్టుగా ఫ్యాన్స్ కు మరో సర్ ఫ్రైజ్ ఇచ్చాడు. తాను నటించబోతున్న సినిమాకు ఎవరూ ఊహించని టైటిల్ ఖరారు చేశారు. ఇప్పటికే ‘బింబిసార’తో మంచి ఊపు మీదున్న కళ్యాణ్ రామ్ మైత్రీ మూవీ మేకర్స్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దాదాపు పూర్తి కావస్తోంది. తాజాగా ఈ సినిమాకు ‘అమిగోస్(AMIGOS)’ అనే పేరు పెట్టారు. రాజేంద్ర రెడ్డి అనే కొత్త దర్శకుడు దీనిని తీస్తున్నారు. నవీన్ ఎర్నేనీ, యలమంచిలి శంకర్ నిర్మాతలుగా ఉన్నారు. అయితే ఊహించని లుక్ లో సర్ ప్రైజ్ చేసిన కళ్యాణ్ సినిమాపై హాట్ టాపిక్ అయింది.
Nandamuri Kalyan Ram AMIGOS
AMIGOS అంటే స్పానిష్ లో స్నేహితుడు అని అర్థం. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం లో కనిపించే అవకాశం ఉంది. ఈ ముగ్గురు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తారు. గతంలో హరే రామ అనే సినిమాలో కళ్యాణ్ ద్విపాత్రాభినయం చేశారు. ఆ తరువాత ఇప్పుడు ఏకంగా మూడు పాత్రల్లో కనిపించనున్నారు. ఇక AMIGOS టైటిల్ కింద ‘మీలాగే కనిపించే వారిని మీరు కలిసినప్పుడు మీరు చనిపోతారు..’అనే క్యాప్షన్ ఉంది. అంటే ముగ్గురి మధ్య శత్రుత్వం ఉంటుందా..? అని అనుకుంటున్నారు.
2023 ఏప్రిల్ 10న ఈ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇందులో కళ్యాణ్ రామ్ సరసన ఆషిక రంగనాథ్ హీరోయిన్. బ్రహ్మాజీ, సప్తగిరి, రాజీవ్ పిళ్లై తదితరులు నటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలో ప్రారంభం అవుతాయని సినీ టాక్. జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకు రామజోగయ్య శాస్త్రి, రెహమాన్ పాటలు రాశారు. ఎడిటర్ తమ్మిరాజు. సినిమాటోగ్రఫీ ఎస్. సౌందర రాజన్.
Nandamuri Kalyan Ram AMIGOS
కళ్యాణ్ రామ్ ఇప్పటి వరకు 18 సినిమాల్లో నటించారు. సినిమాలతో సంబంధం లేకుండా విభిన్న కథలతో వస్తున్నాడు. లాస్ట్ టైం బింబిసార తో వచ్చిన ఈ హీరో దాని సీక్వెల్ కూడా చేయనున్నట్లు సమాచారం. అయితే ఇంతలో AMIGOS సినిమా గురించి తెలిసి సినీ ఇండస్ట్రీ షాక్ కు గురైంది. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా కళ్యాణ్ రామ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కళ్యాణ్ రామ్ సినిమాలు స్లోగా వచ్చినా అవి మంచి సినిమాలే ఉంటాయిన కొందరు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.