Bigg Boss 6 Telugu- Geetu Re-Entry: బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ లో గీతూ చాలా ప్రత్యేకం. ఆమెపై ప్రేక్షకులకు ప్రేమా ద్వేషం రెండూ ఎక్కువే. గీతూ ఎలిమినేషన్ తర్వాత సోషల్ మీడియాలో అతిపెద్ద చర్చ నడుస్తోంది. కొందరు నెటిజన్లు ఆమెను సమర్థిస్తున్నారు. గీతూ ఎలిమినేషన్ అన్యాయం, ఆమె తిరిగి హౌస్లోకి రావాలని కోరుకుంటున్నారు. మరికొందరు మాత్రం వద్దు బాబోయ్, భరించింది చాలు ఇక మాకొద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో గీతూని మరలా తిరిగి హౌస్ కి పంపాలా వద్దా? అని అనే సందిగ్ధంలో నిర్వాహకులు ఉన్నారు. ఈ విషయంలో వారు ఒక నిర్ణయానికి వచ్చారట.

గీతూ రీఎంట్రీ అనేది టీఆర్పీ, కంటెస్టెంట్స్ గేమ్ పై ఆధారపడి ఉంటుందట. గీతూ పై నెగిటివిటీ ఉన్నప్పటికీ కంటెస్టెంట్స్ ని రెచ్చగొట్టి గేమ్ అగ్రెసివ్ ఆడేలా చేసింది. అదే సమయంలో అసలు అవగాహన లేని కంటెస్టెంట్స్ కి గేమ్ అంటే ఏమిటో తెలియజేసింది. గీతూ ఎలిమినేషన్ నేపథ్యంలో హౌస్లో ఆటతీరులో పెను మార్పులు రావడం ఖాయం. మునుపటి తెగువ కంటెస్టెంట్స్ లో కనిపించకపోవచ్చు. అదే జరిగితే టీఆర్పీ మరింత దిగజారుతుంది. అప్పుడు గీతూ రీ ఎంట్రీ తప్పదు.
రానున్న వారాల్లో బిగ్ బాస్ షో ఆశాజనకంగా లేకుంటే గీతూని పంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమెకు గ్రాండ్ రీఎంట్రీ ఉంటుందట. గీతూ మరలా హౌస్లోకి వెళితే గేమ్ మరింత ఆసక్తికరంగా మారడం ఖాయం. తన తప్పులు ఏమిటో తెలుసుకున్న గీతూకి బయట పరిస్థితులు ఏంటి, కంటెస్టెంట్స్ పై ఆడియన్స్ కి ఉన్న అభిప్రాయం తెలుసు కాబట్టి మాట తీరు, ఆట తీరులో స్పష్టమైన మార్పు కనిపించడం ఖాయం. గతంలో వలె ఆమె అగ్రెసివ్ గా ఉంటారా? లేక సాఫ్ట్ గా సేఫ్ గేమ్ ఆడతారా? అనేది చూడాలి.

వైల్డ్ కార్డుతో గీతూ రీఎంట్రీ ఇచ్చినా ఆమెకు టైటిల్ గెలుచుకునే అవకాశం ఉండదు. ఒకసారి బయటకు వచ్చి వెళ్లిన వాళ్ళకు ఆ ఛాన్స్ ఉండదు. గతంలో అలీ రెజా ఎలిమినేటై వైల్డ్ కార్డుతో రీఎంట్రీ ఇచ్చాడు .అతడు ఫైనల్ కి చేరాడు కానీ టైటిల్ అందుకోలేదు. మరి చూడాలి రానున్న రోజుల్లో బిగ్ బాస్ షోలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోనున్నాయో. కాగా 10వ వారం తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. ఆదిరెడ్డి, రేవంత్, బాల ఆదిత్య వంటి టాప్ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.