Jr NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ‘విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు’ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించారు. ఇక ఆయన సినిమాలను చూడడానికి జనం తండోపతండాలుగా థియేటర్లకు వస్తూ ఉండేవారు. పౌరాణిక సినిమాల్లో తనకంటూ ఒక మార్కును సెట్ చేసి పెట్టుకున్న ఆయన తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే పౌరాణిక చిత్రాల్లో రాముడిగా, కృష్ణుడిగా, అర్జునుడిగా పలు వైవిధ్యమైన పాత్రలను పోషించాడు. ఆయన పోషించిన పాత్రలకు ఆయనకు మంచి గుర్తింపు రావడమే కాకుండా రాముడు ఎలా ఉంటాడు అంటే ప్రతి ఒక్కరి మైండ్ లోకి వచ్చే మొట్ట మొదటి వ్యక్తి ఎన్టీఆర్… కృష్ణుడు అంటే కూడా మనకు అతనే గుర్తుకొస్తాడు. ఇక నందమూరి ఫ్యామిలీ రెండో తరం వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు సైతం భారీ విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక మూడోవ తరంలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వాళ్ల తాత ఆశీస్సులతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ లను సాధించాడు. అయినప్పటికి అతని మీద ఉన్న కోపంతో నందమూరి ఫ్యామిలీ లోని కొంతమంది అతను నందమూరి ఫ్యామిలీ మూడవతరం వారసుడు అనే విషయాన్ని ఒప్పుకోలేకపోతున్నారు. దానివల్లే అతనికి పోటీగా కళ్యాణ్ రామ్, తారకరత్న ని దించారు. వీరిద్దరూ కూడా అంత పెద్దగా సక్సెస్ లనైతే సాధించలేదు.
Also Read : హీరో రామ్ దగ్గర నుంచి కావాలనే ఎన్టీఆర్ ఆ సినిమాను లాక్కున్నాడా.? ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..?
ఇక ఇప్పుడు బాలయ్య బాబు (Balayya Babu) కొడుకు అయిన మోక్షజ్ఞ(Mokshagna) ని రంగంలోకి దించుతున్నారు. ఇక అతనితో పాటుగా హరికృష్ణ మనవడు, జానకి రామ్ కొడుకు అయిన చిన్న ఎన్టీఆర్ ను సైతం పోటీకి దించుతున్నారు. మరి ఈ క్రమంలోనే వీళ్ళందరూ జూనియర్ ఎన్టీఆర్ కి పోటీగా వస్తున్నప్పటికి వాళ్ళు ఎవరూ ఆయన తాకిడి ముందు తట్టుకోలేకపోతున్నారు.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. కాబట్టి అతన్ని ఢీకొట్టడం అంటే అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు… ఇక ఏది ఏమైనా కూడా నందమూరి ఫ్యామిలీ మూడోతరం బాధ్యతలను ముందుకు తీసుకెళ్లగలిగే కెపాసిటి ఉన్న ఏకైక వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే…
ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా జనాలకు తెలిసిన వాస్తవం… మరి రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ మరిన్ని సక్సెస్ లను సాధించి ఇండియా వైడ్ గా తన ఫ్యామిలీ పేరుని చిరస్మరణీయంగా నిలపాలనే ప్రయత్నం చేస్తున్నాడు…