బాలయ్య రెమ్యూనరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే !

తెలుగు హీరోల రెమ్యూనిరేషన్లు నలభై కోట్లు యాభై కోట్లు వరకూ వెళ్తాయని ఎవ్వరూ ఊహించలేదు. అరె.. ఏవరేజ్ మార్కెట్ ఉన్న మిడ్ రేంజ్ హీరోలు కూడా పది కోట్లు డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏభై ఐదు కోట్లు తీసుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తను చేసే సినిమాలకు గానూ పర్సెంటేజ్ ల లెక్క తీసుకుంటున్నాడు. దాదాపు మహేష్ రెమ్యునరేషన్ కూడా ఏభై కోట్ల పై మాటే. […]

Written By: admin, Updated On : April 28, 2021 1:56 pm
Follow us on

తెలుగు హీరోల రెమ్యూనిరేషన్లు నలభై కోట్లు యాభై కోట్లు వరకూ వెళ్తాయని ఎవ్వరూ ఊహించలేదు. అరె.. ఏవరేజ్ మార్కెట్ ఉన్న మిడ్ రేంజ్ హీరోలు కూడా పది కోట్లు డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏభై ఐదు కోట్లు తీసుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తను చేసే సినిమాలకు గానూ పర్సెంటేజ్ ల లెక్క తీసుకుంటున్నాడు. దాదాపు మహేష్ రెమ్యునరేషన్ కూడా ఏభై కోట్ల పై మాటే.

అలాగే ఎన్టీఆర్ కి ఫుల్ డిమాండ్ క్రియేట్ అయ్యేలా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ నటన అద్భుతమనే టాక్ రావడం, తారక్ నటన పై హిందీ ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తూ ఉండటంతో.. మొత్తానికి ఫ్యూచర్ సాలిడ్ పాన్ ఇండియా స్టార్ ‘ఎన్టీఆరే’ అనే ముద్ర పడిపోయింది. అందుకే ఓ ప్రముఖ బాలీవుడ్ సంస్థ ఎన్టీఆర్ కి ఏకంగా అరవై కోట్లు వరకూ ఇస్తామంటూ ఆఫర్ చేసిందట. కొరటాల సినిమా తరువాత, ఎన్టీఆర్ ఆ సంస్థకే సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక బన్నీ, చరణ్, ప్రభాస్ లు కూడా ఇంచుమించుగా ఏభై కోట్ల దగ్గరలో ఉన్నారు. అయితే, సీనియర్ హీరోల పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఒకపక్క కుర్ర హీరోలు ఏభై నలభై అంటూ తారాస్థాయిలో ఉంటే.. సీనియర్స్ మాత్రం ఇంకా పది కోట్ల దగ్గరే ఆగిపోయారు. కొంతమందికి అయితే ఆ పదిలో సగం కూడా రాని దౌర్భాగ్యపు పరిస్థితి కనిపిస్తోంది.

ముందుగా మెగాస్టార్ గురించి చూస్తే ఆయనకి సినిమాకి ఇంత అని కాకుండా.. లాభాల్లో వాటా ఇస్తున్నారు. పైగా నిర్మాణ సంస్థ కూడా మెగాస్టార్ దే కాబట్టి లెక్కలు తెలియడం లేదు. ఇక విక్టరీ వెంకటేష్ ‘ఎఫ్ 3’ సినిమాకు ప్రస్తుతం నాలుగు కోట్లు తీసుకుంటున్నాడు. అంటే.. వెంకీ రెమ్యునరేషన్ మిగతా సినిమాలకు కూడా కరెక్ట్ గా ఐదు కోట్లు లోపే. నాగార్జున రెమ్యూనిరేషన్ కూడా ఐదు కోట్ల రేంజ్ లో ఉంది. మరి బాలయ్య సంగతి ఏమిటి ?

చాలామంది సినిమా వాళ్ళు కూడా బాలయ్య ఎంత తీసుకుంటున్నాడు అని ఆసక్తిగా అడుగుతుంటారు. ఎందుకంటే బాలయ్య రెమ్యునరేషన్ ఎంత అనేది కరెక్ట్ గా చెప్పలేం. ఒక్కో నిర్మాత దగ్గర ఒక్కోలా బాలయ్యకు రెమ్యునరేషన్ ను ఇస్తున్నారు. ప్రస్తుతానికి అఖండ సినిమాకు గానూ బాలయ్య ఏడు కోట్లు వరకూ పుచ్చుకుంటున్నాడు. నిజానికి బాలయ్య పది కోట్లు వరకూ డిమాండ్ చేసారని, కానీ సినిమా బడ్జెట్ పెరగడం వల్ల ఏడు కోట్లకు బాలయ్య కాంప్రమైజ్ అయ్యారని తెలుస్తోంది.