Sirivennela: సిరివెన్నెల పార్థివదేహాన్ని సందర్శించి కంటతడి పెట్టిన బాలయ్య

Sirivennela: టాలీవుడ్​ దిగ్గజ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మంగళవారం సాయంత్రం స్వర్గస్తులయ్యారు. దీంతో, సినీ ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. మరోవైపు, అభిమానులు ఆయన మృతితో తీవ్ర దిగ్భ్రంతి చెందారు. ఈ క్రమంలోనే ఆయన పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్​ఛాంబర్​లో ఉంచారు. సిరివెన్నెలకు తుది నివాళులు అర్పించేందుకు పలువురు సినీ ప్రముఖులు ఫిల్మ్​ ఛాంబర్​కు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం సిరివెన్నెల పార్థివదేహాన్ని త్రివిక్రమ్​తో పాటు, రాజమౌళి, కీరవాణి, విక్టరీ వెంకటేశ్​, సాయికుమార్​, […]

Written By: Sekhar Katiki, Updated On : December 1, 2021 11:36 am
Follow us on

Sirivennela: టాలీవుడ్​ దిగ్గజ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మంగళవారం సాయంత్రం స్వర్గస్తులయ్యారు. దీంతో, సినీ ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. మరోవైపు, అభిమానులు ఆయన మృతితో తీవ్ర దిగ్భ్రంతి చెందారు. ఈ క్రమంలోనే ఆయన పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్​ఛాంబర్​లో ఉంచారు. సిరివెన్నెలకు తుది నివాళులు అర్పించేందుకు పలువురు సినీ ప్రముఖులు ఫిల్మ్​ ఛాంబర్​కు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం సిరివెన్నెల పార్థివదేహాన్ని త్రివిక్రమ్​తో పాటు, రాజమౌళి, కీరవాణి, విక్టరీ వెంకటేశ్​, సాయికుమార్​, తనికెళ్ల భరణి, మణిశర్మ, టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్​, ఎస్​వి కృష్ణఆ రెడ్డి, మారుది, మురళీమోహన్​, నందినీరెడ్డి తదితరులు సందర్శించారు. ఆయనకు నివాళులు అర్పించి పూలమాల సమర్పించారు.

తాజాగా, నందమూరి బాలకృష్ణ కూడా సిరివెన్నెల భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలయ్య ఎమోషనల్ అవుతూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఈ రోజు చాలా దుర్దినం.. నిజంగా నమ్మలేని నిజం. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషకు, సాహిత్యానికి ఒక భూషణుడు సరివెన్నెల. తాను పుట్టిన నెలకు వన్నె తెచ్చిన మహా వ్యక్తి అని పేర్కొన్నారు. 1984లో విశ్వనాథ్ దర్శకత్వంలో తాను నటించిన జననీ.. జన్మభూమి చిత్రంతోనే సిరివెన్నెల సినీ పరిశ్రమకు పరిచయం కావడం తన అదృష్టమన్నారు. సిరివెన్నెల లేరంటే చిత్ర పరిశ్రమ శోక సముద్రంలో ఉన్నట్లు ఉందన్నారు. తనకు సాహిత్యం అంటే ఇష్టమని.. సిరివెన్నెలతో కలిసినప్పుడల్లా తాము సాహిత్యంపై ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం అని బాలయ్య అన్నారు.  పుట్టినవారు గిట్టక తప్పదు.. కానీ 66 ఏళ్ళకే సిరివెన్నెల వెళ్లిపోయారంటూ బాలయ్య కంటతడి పెట్టుకున్నారు.