Balakrishna: నందమూరి నటసింహంగా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న నటుడు బాలయ్య బాబు…ఆయన ఇప్పటికి వరుస సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగు పెట్టాడో అప్పటినుంచి తన చివరి శ్వాస వరకు సినిమానే జీవితంగా బతుకుతానని చెప్పాడు. బాలయ్య ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కూడా నిన్న మొన్న వచ్చిన హీరోల మాదిరిగా కష్టపడుతూ ఉంటాడు. ఒక సీన్ కోసం ఆయన విపరీతంగా కష్టపడతారు. చివరికి డైరెక్టర్ సైతం పర్లేదు షాట్ ఓకే అని చెప్పినా కూడా అతనికి అన్ సాటిస్ఫైడ్ గా అనిపిస్తే మాత్రం ఎంత రిస్క్ అయిన సరే మరోసారి ఆ సీన్ చేద్దామని కరాకండిగా చెప్పేస్తాడు. అలాంటి బాలయ్య రీసెంట్ టైంలో చేస్తున్న సినిమాలన్నీ మాస్ సినిమాలే కావడం విశేషం…ఒకప్పుడు ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తూ ఇప్పుడు మాత్రం మాస్ సినిమాల వైపు ఎందుకు వెళ్తున్నాడు. ఇప్పటికి ప్రయోగాత్మకమైన సినిమాలను చేయొచ్చు కదా! అంటే మాత్రం బాలయ్య బాబు ఇమేజ్ కు తగ్గట్టుగా సినిమాలను తీసే దర్శకులు ఇండస్ట్రీ లో ఉన్నారా? లేదా అనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఇక ఇదిలా ఉంటే ఒక్కసారి బాలయ్య బాబుకి కథ నచ్చితే ఆ డైరెక్టర్ కి పూర్తిగా సరెండర్ అయిపోతాడు. బాలయ్యను స్క్రీన్ మీద చూపించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. హై వోల్టేజ్ సీన్స్ తో ప్రేక్షకులను మెప్పించగలిగే కంటెంట్ తో బాలయ్య భారీ విజయాలను అందుకోగలుగుతాడు.
కానీ డైరెక్టర్ సెట్ లో ఏమాత్రం తడబడిన కూడా బాలయ్య బాబు ఆ డైరెక్టర్ ని కొట్టడానికైనా సిద్ధపడతాడు. ఒకవేళ డైరెక్టర్ క్లారిటీతో ఉంటే మాత్రం డైరెక్టర్ చెప్పింది వింటాడు. తను నిల్చోమంటే నిల్చుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. ఇక బాలయ్య కి ఏ మాత్రం తేడ కొట్టిన కూడా బాలయ్య చేతిలో దర్శకుడికి మూడుతుందనే చెప్పాలి.
ఇప్పటికే చాలామంది దర్శకులు అతని చేతిలో దెబ్బలు తిన్నారు అంటూ గతంలో చాలా వార్తలైతే వచ్చాయి. ఇక వాటి మీద బాలయ్య కూడా గతంలో క్లారిటీ ఇచ్చాడు. తన ముందు కుప్పిగంతులు వేస్తే మాత్రం దెబ్బలు తప్పవని బాలయ్య ఓపెన్ గా చెప్పాడు. బాలయ్య డైరెక్టర్ల హీరో అని చెబుతూ ఉంటారు. డైరెక్టర్లకు పూర్తి ఫ్రీడమ్ ఇస్తాడు. వినకపోతే బాలయ్య తన స్టైల్ లో వాళ్ళకి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాడు…