Balakrishna Fans Fire On NTR: బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబం నుండి స్టార్స్ గా ఎదిగిన హీరోలు. సీనియర్ ఎన్టీఆర్ సినీ వారసత్వాన్ని నిలబెట్టిన వారసులు. అయితే కొన్నాళ్లుగా వీరి మధ్య విబేధాలు ఉన్నాయనే వాదన ఉంది. రాజకీయ కారణాలతో నందమూరి కుటుంబం ఎన్టీఆర్ ని దూరం పెట్టారనని కొందరు అంటారు. 2009 నుండి ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో బాలయ్య 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. హిందూపురం ఎంఎల్ఏ గా రెండు సార్లు ఎన్నికయ్యారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ జయంతి,వర్ధంతి వంటి కార్యక్రమాల్లో కూడా ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి పాల్గొన్న దాఖలాలు లేవు.
తండ్రి హరికృష్ణ మరణం తర్వాత కూడా ఎన్టీఆర్ బాలయ్యకు దగ్గర కాలేదు. కాగా వీరి మధ్య ఉన్న విబేధాలు బాలయ్య పుట్టినరోజు వేదికగా మరలా బయటపడ్డాయంటున్నారు. బాలయ్యకు ఎన్టీఆర్ కనీసం బర్త్ డే విషెస్ చెప్పకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో బాలకృష్ణ అభిమానులు ఎన్టీఆర్ పై మండిపడుతున్నారు. జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే కాగా… ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు వేడుకలు నిర్వహించారు. బాలయ్య పేరిట సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే సోషల్ మీడియా వేదికగా రాజకీయ, చిత్ర ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Also Read: Megastar Chiranjeevi: చిరంజీవికి అంత కోపం వచ్చిందా.. ఏకంగా వాక్ అవుట్ చేశాడటగా!
ఎన్టీఆర్ మాత్రం బాలయ్యకు బర్త్ డే విషెస్ చెప్పలేదు. ఈ పరిణామం బాలయ్య అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. తమ అసహనాన్ని సోషల్ మీడియా ద్వారా వెళ్లగక్కుతున్నారు. సొంత బాబాయ్ కి కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే తీరిక లేదా అంటూ, ప్రశ్నిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ని సమర్దించే నందమూరి అభిమానులు మరోలా స్పందిస్తున్నారు. కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టనంత మాత్రాన బాలయ్యకు ఎన్టీఆర్ బర్త్ డే విషెస్ చెప్పలేదని ఎలా అంటారు. నేరుగా ఫోన్ చేసి మాట్లాడి ఉండవచ్చుగా అంటున్నారు. పూర్తి సమాచారం లేకుండా ఓ అభిప్రాయానికి రాకూడదు అంటున్నారు.
ఇక టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, మహేష్, వెంకటేష్, నాగార్జున వంటి వారు ఇతర హీరోల పుట్టిన రోజులకు స్పందిస్తూ ఉంటారు. సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేస్తారు. అయితే వీరిలో ఒక్కరు కూడా బాలయ్యకు బర్త్ డే విషెస్ చెప్పలేదు.
Also Read:Poonam Bajwa: రెచ్చిపోయిన బన్నీ హీరోయిన్.. పొట్టిలాగు ధరించి బీచ్ లో అలాంటి ఫోజులు!