Homeఎంటర్టైన్మెంట్Nandamuri Balakrishna New House Hindupur: కొత్త ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన నందమూరి బాలకృష్ణ..వీడియో...

Nandamuri Balakrishna New House Hindupur: కొత్త ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన నందమూరి బాలకృష్ణ..వీడియో వైరల్!

Nandamuri Balakrishna New House Hindupur: ఇక నుండి బాలయ్య(Nandamuri Balakrishna) హైదరాబాద్ నుండి,తాను ఎమ్మెల్యే గా పని చేస్తున్న హిందూపురం కి షిఫ్ట్ అవబోతున్నాడా?, ఇకపై ఆయన తన నియోజగవర్గం అభివృద్ధిని స్వయంగా తన కళ్లారా చూసేందుకే హిందూపురం కి షిఫ్ట్ అవుతున్నాడా?, అంటే అవుననే చెప్పాలి. నేడు హిందూపురం పట్టణం పున్నమ్మ కాలనీలో బాలయ్య తన సొంతింటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈరోజు ఉదయం ముహూర్త సమయానికి బాలయ్య , తన సతీమణి వసుంధర తో కలిసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ ‘మా తండ్రి నందమూరి తారకరామారావు గారు గతం లో హిందూపురం నుండి మూడు సార్లు పోటీ చేసి గెలిచి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన తనయుడిగా వచ్చిన నన్ను కూడా ఈ హిందూపురం ప్రజలు మూడుసార్లు గెలిపించి అసెంబ్లీ కి పంపించారు’.

‘నన్ను, నా తండ్రి గారిని గుండెల్లో పెట్టుకొని పూజించిన ఈ నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్న్డలనే ఉద్దేశ్యంతోనే ఇక్కడ నా ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈరోజు నా చిరకాల కోరిక తీరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాపై ఇంతటి ఆదరాభిమానాలు చూపుతున్న ఈ ప్రజలకు మనస్ఫూర్తిగా సేవ చేసుకొని, ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెయ్యాలి అనేదే నా ఆశయం’ అంటూ ఈ సందర్భంగా బాలయ్య చెప్పుకొచ్చాడు. అయితే తన పూర్తి సమయాన్ని హిందూపురం లోనే కేటాయిస్తాడా?, లేదా నెలకు రెండు మూడుసార్లు వచ్చి పోతాడా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే బాలయ్య యాక్టీవ్ గా ఉన్న సినీ నటుడు. వరుసపెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అదే విధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ని కూడా బాలయ్య నే స్వయంగా దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ రెండిటిని వదిలి రావాలంటే కష్టమే. అందుకే ఆయన నెలకు రెండు మూడు సార్లు వచ్చి వెళ్తాడని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే, గత ఏడాది ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వం లో నటించిన ‘అఖండ 2’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ సినిమా తర్వాత ఆయన డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో ఒక సినిమా చేయడానికి రెడీ గా ఉన్నాడు. అదే విధంగా దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ఒక సినిమా, హరీష్ శంకర్ దర్శకత్వం లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ముందుగా గోపిచంద్ మలినేని మూవీ ని ప్రారంభించబోతున్నారు. గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం ఎంతటి బ్లాక్ బస్టర్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే. మళ్లీ అదే మ్యాజిక్ ని రిపీట్ చేయడానికి సిద్ధం అవుతోంది ఈ క్రేజీ కాంబినేషన్.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular