Nandamuri Balakrishna backed away from Chiranjeevi : ప్రతి ఏడాది సంక్రాంతి వచ్చిందంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి పోరు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..టాలీవుడ్ స్టార్ హీరోలందరూ సంక్రాంతి డేట్స్ కోసం పోటీ పడుతూ ఉంటారు..ఇక పెద్ద హీరోల సినిమాలు వచ్చాయంటే ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ హీట్ వాతావరణం ఉంటుందో ఊహించుకోవచ్చు..గతం లో రామ్ చరణ్ , మహేష్ బాబు , అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి సంక్రాంతి సీసన్ లో ఒక రోజు గ్యాప్ తో విడుదలయ్యేవి..సూపర్ హిట్ అయ్యాయి కూడా..ఇక వచ్చే సంక్రాంతి కి కూడా పెద్ద హీరోల సినిమాలు విడుదల అవ్వడానికి క్యూ కడుతున్నాయి.

ఈసారి సంక్రాంతి బరిలో ప్రభాస్ ఆదిపురుష్..మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య , నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి మరియు అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి..ఈ నాలుగు సినిమాలు ఒక రోజు గ్యాప్ లో విడుదలవ్వనున్నాయి..అయితే వీటిల్లో ఎదో ఒకటి కచ్చితంగా తప్పుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి మరియు బాలయ్య బాబు ‘వీర సింహా రెడ్డి’ చిత్రానికి, రెండిటికి కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలు వ్యవహరిస్తున్నారు..ఇలా ఒక నిర్మాణ సంస్థ నుండి రెండు సినిమాలు క్లాష్ అవ్వడం తెలుగు సినిమా చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు..అలా మొట్టమొదటిసారి జరగబోతుండడం తో డిస్ట్రిబ్యూటర్స్ ‘మా వల్ల కాదు..మేము థియేటర్స్ సర్దుబాటు చెయ్యలేం..ఎదో ఒక మూవీ ని తప్పించండి’ అంటూ మైత్రి మూవీ మేకర్స్ మీద ఒత్తిడి చేస్తున్నారట..మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండడం తో ఆ సినిమానే విడుదల చెయ్యమని పట్టుబడుతున్నారట.
ఈ విషయం ని మైత్రి మూవీస్ అధినేత నవీన్ గారు ఇదే విషయాన్నీ బాలయ్య దృష్టికి తీసుకొని రాగా, తప్పనిసరి పరిస్థితి అయితే వాయిదా వేసుకోండి..మరో మంచి డేట్ లో సినిమా రిలీజ్ చేసుకుందాం అంటూ ఆ చిత్ర డైరెక్టర్ గోపీచంద్ మలినేని చెప్పాడట బాలయ్య బాబు..దీనితో మైత్రి మూవీ మేకర్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు సమాచారం..అయితే ఈ రెండు సినిమాలలో సంక్రాంతి కి మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య సినిమా రావడం మాత్రం ఖరారు అయ్యింది.