Balayya Babu , Anil Ravipudi
Balayya Babu and Anil Ravipudi : తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు అందరికి చాలా చిన్నచూపు ఉండేది. కానీ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రి రేంజ్ మారిపోయింది. బాలీవుడ్ ఇండస్ట్రీని పక్కన పెట్టి మన సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ గా కొనసాగడం అనేది నిజంగా చాలా మంచి విషయమనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలోనే చాలామంది స్టార్ హీరోలు సైతం మంచి కథలతో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబు(Balayya Babu) కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ఒక స్టార్ డమ్ ని కూడా ఏర్పాటు చేసుకోవడంలో కీలక పాత్ర వహిస్తున్నాయనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన వరుసగా నాలుగు విజయాలను సాధించి తన కంటూ ఒక సపరేటు ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పటికే బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్ లో అఖండ 2 (Akhanda 2) సినిమా కూడా రాబోతుంది. వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అంటే ఆ సినిమా మీద భారీ హైప్ అయితే క్రియేట్ అవ్వడం పక్క అలాగే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అనిల్ రావిపూడి బాలయ్య బాబు కాంబినేషన్లో ఇంతకుముందు ‘భగవంత్ కేసరి’ (Bhagavantha Kesari) అనే సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా బాలయ్య బాబుకి హ్యాట్రిక్ విజయాలను కట్టబెట్టింది. కాబట్టి మరోసారి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులంతా ఆసక్తితో ఉన్నారు.
మరి ఇలాంటి సందర్భంలోనే బాలయ్య బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ మరోసారి సినిమా సెట్ అవ్వబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మంచి విజయాన్ని సాధించిన అనిల్ రావిపూడి ఇప్పుడు చిరంజీవితో ఒక భారీ సినిమాని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాత బాలయ్య బాబుతో మరొక సినిమా చేయడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఇలాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక ఆయన కమర్షియల్ ఫార్మాట్లోనే సినిమాలు చేస్తున్నప్పటికి ఆయన సినిమాలోని సీన్లు చాలా ఫ్రెష్ గా ఉండడమే కాకుండా ఎమోషన్ ని క్యారీ చేస్తూ సిచువేషన్ కు తగ్గ కామెడీని బిల్డ్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాయి. అందువల్లే ఆయన సినిమాలకు ఇండస్ట్రీలో ఎక్కువగా ఆదరణ అయితే దక్కుతుందనే చెప్పాలి…