Sankranthiki Vastunnam: ఒక నిజమైన సక్సెస్ వచ్చిన తర్వాత వచ్చే ఆనందం మామూలుగా ఉండదు. ఆ సక్సెస్ ని ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఎన్ని సార్లు సెలెబ్రేషన్స్ చేసుకున్నా తనివితీరదు. అలాంటి మూడ్ లోనే ఉంది ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) మూవీ టీం. దిల్ రాజు(Dil Raju) ని కాపాడిన సినిమా ఇదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక సాధారమైన పొలిటికల్ థ్రిల్లర్ స్టోరీ కి అనవసరపు ఖర్చులు చేయించి, ‘గేమ్ చేంజర్’ (Game Changer) చిత్రం తో డైరెక్టర్ శంకర్ దిల్ రాజు ని రోడ్డు మీదకు తీసుకొచ్చేసాడు. కానీ ఆ చిత్రం విడుదలైన మూడు రోజులకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలై దిల్ రాజు కెరీర్ ని కాపాడింది. లేకపోతే ‘గేమ్ చేంజర్’ నష్టాలకు ఆయన కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఈ సినిమాకి సంబంధించిన చివరి సక్సెస్ మీట్ ని నిన్న ఏర్పాటు చేసారు.
ఈ సక్సెస్ మీట్ లో మూవీ టీం మొత్తానికి 300 కోట్ల రూపాయిల గ్రాస్ కి సంబంధించిన షీల్డ్స్ ని అందించారు. ఒక సినిమాకి ఇలా షీల్డ్స్ అందుకొని ఎంత కాలం అయ్యిందో. 2000 సంవత్సరం లో ‘కలిసుందరం రా’ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో మరో ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నాడు. ఒక సాధారణమైన కమర్షియల్ ఎంటర్టైనర్ కి 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావడం అనేది సాధారమైన విషయం కాదు. నిన్నటి సక్సెస్ మీట్ లో మూవీ టీం ముఖాల్లో ఉన్న ఆనందాన్ని చూస్తుంటే నిజమైన సక్సెస్ కి నిర్వచనం ఇదే కదా అని అనిపించింది. అంతా బాగానే ఉంది కానీ నిన్న అతిథి గా వచ్చిన ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) ని అనీల్ రావిపూడి(Anil Ravipudi) అవమానించినట్టుగా అనిపించింది.
అతిథి గా వచ్చిన వాళ్లకు కృతఙ్ఞతలు చెప్తూ హరీష్ శంకర్ వైపు చూసి అతని పేరు చెప్పడం మర్చిపోతాడు అనీల్ రావిపూడి. అప్పుడు పక్కనే ఉన్న దిల్ రాజు హరీష్ శంకర్ అని అందించడంతో, అనిల్ రావిపూడి దానికి సమాధానం ఇస్తూ’అంటే ముందు ఎదో ఒకటి పవర్ ఫుల్ గా జత చేసి చెపుదాం అని అనుకున్నాను’ అని చెప్తూ ‘మా గబ్బర్ సింగ్ హరీష్ శంకర్ కి కృతఙ్ఞతలు’ అంటూ కవరింగ్ చేసాడు. దీనికి పాపం హరీష్ శంకర్ కాస్త హర్ట్ అయ్యినట్టు అనిపించింది. అనీల్ రావిపూడి కచ్చితంగా పేరు మర్చిపోయాడని, కవరింగ్ కోసమే అలా మాట్లాడాడు అంటూ ఈ వీడియో ని చూసిన ప్రతీ ఒక్కరు అభిప్రాయపడ్డారు. అదే ఈవెంట్ కి అతిథి గా వచ్చిన మరో డైరెక్టర్ వంశీ పైడిపల్లి ని మాత్రం నా అన్న లాంటోడు అంటూ సంబోధించడం కూడా హైలైట్ గా మారింది. ఒకసారి ఆయన ప్రసంగాన్ని చూసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.