Akhanda 2 : నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన చాలా మంది హీరోలు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా బాలయ్య బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటులు ప్రస్తుతం వరుస సక్సెస్ లతో అదరగొడుతున్నారు. దాంతో వాళ్ళ సినిమాలకు ప్రేక్షకుల్లో చాలా మంచి క్రేజ్ దక్కుతోంది. ఇక ప్రస్తుతం బాలయ్య బాబు యంగ్ హీరోలతో పోటీ పడుతూ గొప్ప సినిమాలను చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు… బాలయ్య – బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ‘అఖండ 2’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బాలయ్య బాబు ఇందులో చెప్పిన డైలాగు మాస్ ప్రేక్షకుల్లో పూనకాలు తెప్పిస్తుంది…
ఇక ఈ సినిమాలో బాలయ్య బాబు అఘోర గా నటిస్తున్నాడు. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు బాలయ్య బాబు చాలా వరకు కేర్ఫుల్ గా నటించాడట. అలాగే మొదటి పార్ట్ లో అఘోర పాత్ర కి పెద్దగా మేకప్ ఏమి ఉండదు. కానీ ఈ సినిమాలో అఘోర లుక్ రావడానికి బాలయ్యను దాదాపు రెండు మూడు గంటలపాటు కూర్చోబెట్టి మేకప్ చేసేవారట. ఆ టైం లో ఆయన వాటర్ తాగడానికి కూడా వీలు ఉండేది కాదట.
ఎందుకంటే మధ్యలో నోరు తెరిచి వాటర్ తాగితే ఆ మేకప్ అంత ప్యాచులుగా మారేదట…వాటన్నింటికి ఓర్చుకొని బాలయ్య ఓపిగ్గా మేకప్ వేయించుకోవడం నిజంగా గ్రేట్ అంటూ అందరూ ఆయన్ని పొగుతున్నారు… బాలయ్య బాబుకి ఒక క్యారెక్టర్ నచ్చితే అందులో ఎంతవరకైనా వెళ్తాడు. కాబట్టి ‘అఖండ 2’ సినిమా విషయంలో కూడా ఆయన చాలా ఇంపాక్ట్ ని చూపించాలనే ఉద్దేశ్యంతో భారీ గెటప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఇక ఈ సినిమాతో ఆయన సూపర్ సక్సెస్ ని సాధిస్తే వరుసగా ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వాడవుతాడు. బాలయ్య ఇప్పటికే ఈ సంవత్సరం ‘డాకూ మహారాజు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకు ముందుకు వస్తున్న అఖండ సినిమా బాలయ్య బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలుస్తోందంటూ సినిమా యూనిట్ తో పాటు ఇటు బాలయ్య అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ హిట్ సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…