Women Shelters : అమెరికాలో తెలుగువారికి సేవలందిస్తున్న ఉత్తమ సంస్థలలో ఒకటైన తానా (TANA) మరియు లీడ్ ది పాత్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల విశేష సేవా కార్యక్రమం జరిగింది. తానా ఎన్నారై స్టూడెంట్ కోఆర్డినేటర్ డా. ఉమా ఆర్. కటికి (ఆరమండ్ల) గారి మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా గృహహింస బాధితుల కోసం ఏర్పాటు చేసిన మహిళా ఆశ్రయ కేంద్రాలకు (Women Shelters) అండగా నిలిచారు.

* గ్యారీ, ఇల్లినాయిస్ షెల్టర్లకు విస్తృత సహాయం
శనివారం అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని గ్యారీ ప్రాంతంలో మరియు ఇల్లినాయిస్ ప్రాంతాల్లో ఉన్న డొమెస్టిక్ వైలెన్స్ షెల్టర్లకు ఈ సహాయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రయ కేంద్రాలకు ఆహారం, అవసరమైన వస్తువులు, నగదు రూపంలో సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా డా. ఉమా ఆర్. కటికి (ఆరమండ్ల) గారు మాట్లాడుతూ గతంలో ఇల్లినాయిస్‌లోని షెల్టర్లకు విరాళాలు అందించామని, ఈసారి గ్యారీ మరియు ఇల్లినాయిస్ రాష్ట్రాల్లోని షెల్టర్లకు సహాయం అందించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గృహహింస బాధితులకు కేవలం తాత్కాలిక సాయం అందించడమే కాకుండా వారిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని ఆమె తెలిపారు.

* నిస్సహాయులకు నిరంతర సేవ
గత 15 సంవత్సరాలుగా డా. ఉమా ఆర్. కటికి (ఆరమండ్ల) గారు గృహహింస బాధితులైన మహిళలకు నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు. లీగల్ సపోర్ట్, కౌన్సెలింగ్, పునరావాసం వంటి అంశాల్లో ఆమె అందిస్తున్న తోడ్పాటు అద్వితీయం. ఆమె కృషి ఫలితంగా అనేక మంది మహిళలు తమ జీవితాలను తిరిగి చక్కదిద్దుకోగలిగారు.

తానా చేపట్టిన “చైతన్యస్రవంతి” కార్యక్రమం ద్వారా మహిళా సాధికారత కోసం కృషిచేస్తూ, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడంలో డా. ఉమా గారు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె కేవలం ఒక సహాయకురాలిగా కాకుండా, మహిళలను ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపించే ఒక మార్గదర్శకురాలిగా నిలిచారు.

* తానాలో కీలక బాధ్యతలు, అపూర్వ సేవ
తానా సంస్థలో డా. ఉమా ఆర్. కటికి (ఆరమండ్ల) గారు కల్చరల్ కోఆర్డినేటర్, ఉమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్ వంటి బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం స్టూడెంట్ కోఆర్డినేటర్‌గా విద్యార్థుల సమస్యల పరిష్కారంలోనూ, మహిళల సాధికారతలోనూ తనదైన ముద్ర వేశారు.

ఉమెన్ సర్వీసెస్, కల్చరల్ సర్వీసెస్, స్టూడెంట్ సపోర్ట్ వంటి అన్ని రంగాల్లో డా. ఉమా ఆర్. కటికి (ఆరమండ్ల) గారు చూపిన అంకితభావం ఈ విజయాలకు మూలం. డా. ఉమా ఆర్. కటికి (ఆరమండ్ల) గారి నిస్వార్థ బాధిత మహిళలంతా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వీరి సేవా యాత్ర మరింత మందికి స్ఫూర్తినివ్వాలని ఆశిద్దాం.
