https://oktelugu.com/

కరోనా కంటే.. బాలయ్యే ఎక్కువ భయపెడుతున్నాడు !

నట సింహం నందమూరి బాలకృష్ణ అంటేనే ఓ ప్రత్యేకత.. ఓ మితిమీరిన ఆవేశం.. బాలయ్య బాబు ఆలోచనలు కూడా చాలా కొత్తగా ఉంటూ ఉంటాయి. అసలు బాలయ్య బాబు గురించి ఎంత చెప్పుకున్నా… ఆ మాటకొస్తే.. ఆయన పాత్రలోని విభిన్నత్వం గురించి ఎంతైనా మొరపెట్టుకోవచ్చు. ఇక తాజాగా బాలయ్య బాబుగారు కరోనా వైరస్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు, ఈ వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసినా.. బాలయ్య బాబుగారి ఆలోచన స్థాయిని బహు ఘనంగా చాటి చెప్పాయి. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : November 16, 2020 / 06:35 PM IST
    Follow us on


    నట సింహం నందమూరి బాలకృష్ణ అంటేనే ఓ ప్రత్యేకత.. ఓ మితిమీరిన ఆవేశం.. బాలయ్య బాబు ఆలోచనలు కూడా చాలా కొత్తగా ఉంటూ ఉంటాయి. అసలు బాలయ్య బాబు గురించి ఎంత చెప్పుకున్నా… ఆ మాటకొస్తే.. ఆయన పాత్రలోని విభిన్నత్వం గురించి ఎంతైనా మొరపెట్టుకోవచ్చు. ఇక తాజాగా బాలయ్య బాబుగారు కరోనా వైరస్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు, ఈ వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసినా.. బాలయ్య బాబుగారి ఆలోచన స్థాయిని బహు ఘనంగా చాటి చెప్పాయి. ఓ సినిమా ప్రారంభోత్సవంలో బాలయ్య బాబు మాట్లాడుతూ.. కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యమన్నారు.

    Also Read: హోస్ట్ గా ఒకప్పటి హాట్ హీరోయిన్.. !

    ఇంతటితో ముగిస్తే.. ఆయన బాలయ్య ఎందుకు అవుతారు.. అందుకే తనకే సాధ్యం అయ్యే ఓ భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చారు. కరోనాకి వ్యాక్సిన్ రాదట. బాలయ్య తేల్చేశాడు. ఈ వైరస్ మానవ శరీరంలో పరివర్తన చెందుతోందని, అందుకే టీకా చేయడానికి ఇంత సమయం తీసుకుంటున్నారని.. ఇక వ్యాక్సిన్ రాదని బాలయ్య సగర్వంగా చెప్పుకొచ్చాడు. మొత్తానికి బాలయ్య మాటలకు ఏడవాలో నవ్వాలో అర్ధం కావడం లేదు. కోవిడ్ -19 అందరినీ గందరగోళానికి గురిచేస్తోంది అనుకుంటే.. ఇప్పుడు కొత్తగా బాలయ్య కూడా తన శైలి కామెంట్స్ తో భయపెట్టేస్తున్నాడు. నిజమే కరోనా అనేది ఇప్పటివరకు మనం చూసిన ప్రతిదానికీ భిన్నంగా స్పందిస్తోంది.

    Also Read: ఎట్టకేలకు మెగాస్టార్ రెడీ.. 20 నుండి మొదలు !

    కానీ బాలయ్య కూడా అలాగే స్పందిస్తూ పోతే ఎలా ? ఇక బాలయ్య మరో మాట కూడా అన్నాడు. కరోనాతో అశ్రద్ధ వహించవద్దు. ఈ గ్రహం మీద ఎవరూ ప్రకృతికి మించినవారు కాదు, మీరు ప్రకృతిని అగౌరవపరిచినప్పుడు ఏమి జరుగుతుందో ఈ వైరస్ మనకు చూపించింది “అని.. అయితే బాలయ్య కూడా రోజులు గడిచే కొద్దీ తనలోని కొత్త వెరీయేషన్స్ ను చూపించుకుంటూ పోతున్నాడు. మొత్తానికి బాలయ్య నుండి మరో ఆణిముత్యం వచ్చేసింది అన్నమాట. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ‘సింహ, లెజెండ్’ చిత్రాల మాదిరిగా మాస్ అండ్ యాంగ్రీ హీరోగానే కాకుండా ఇంకాస్త కొత్తగా కనిపించాలని గుండు కొట్టించుకున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్