https://oktelugu.com/

Namrata Shirodkar: మనసులు కదిలించేలా మహేష్ వైఫ్ నమ్రత పోస్ట్… ఇంతకీ ఆమె ఏమ్మన్నారంటే?

సంక్రాంతి పండగ నాన్న(కృష్ణ)కు నాకు కలిసొచ్చే సీజన్. ఈ పండగకు గతంలో అనేక బ్లాక్ బస్టర్స్ ఇచ్చాము. ఈసారి కూడా గుంటూరు కారం బ్లాక్ బస్టర్ అవుతుందని మహేష్ విశ్వాసం వ్యక్తం ఇచ్చారు.

Written By:
  • NARESH
  • , Updated On : January 10, 2024 / 01:32 PM IST

    Namrata Shirodkar

    Follow us on

    Namrata Shirodkar: గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా ముగిసింది. మంగళవారం రాత్రి గుంటూరు నగరంలో ఈ వేడుక ఏర్పాటు చేశారు. మహేష్ బాబును చూసేందుకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట కూడా చోటు చేసుకున్నట్లు సమాచారం. అభిమానులు గాయాలపాలయ్యారు. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ తో పాటు దర్శకుడు త్రివిక్రమ్, హీరోయిన్స్ శ్రీలీల, మీనాక్షి చౌదరి, నిర్మాత నాగవంశీ, డిస్ట్రిబ్యూటర్స్ దిల్ రాజు కూడా పాల్గొన్నారు.

    సంక్రాంతి పండగ నాన్న(కృష్ణ)కు నాకు కలిసొచ్చే సీజన్. ఈ పండగకు గతంలో అనేక బ్లాక్ బస్టర్స్ ఇచ్చాము. ఈసారి కూడా గుంటూరు కారం బ్లాక్ బస్టర్ అవుతుందని మహేష్ విశ్వాసం వ్యక్తం ఇచ్చారు. ఈ సక్సెస్ ని చూసేందుకు అమ్మా నాన్న లేరు. కాబట్టి అభిమానులే నాకు అమ్మా నాన్నలు అని మహేష్ చెప్పడం భావోద్వేగానికి గురి చేసింది. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో మహేష్ వైఫ్ నమ్రత శిరోద్కర్ ఎమోషనల్ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు.

    రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఆదరిస్తున్నారు. మీ ప్రేమ మహేష్ మరింత కష్టపడేలా స్ఫూర్తిని ఇస్తుంది. మా సొంత ఊరు గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ వేడుక జరపడం చాలా ప్రత్యేకం. ఆ వేడుకను విజయవంతం చేసిన అభిమానులకు ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి మహేష్…. మీ అభిమానులకు మీరు ఒక ఎమోషనల్… అని ఆమె సుదీర్ఘ సందేశంలో అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. నమ్రత సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది.

    ఇక గుంటూరు కారం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. మహేష్ బాబు మాస్ రోల్ లో మైండ్ బ్లాక్ చేయనున్నాడు. ట్రైలర్ లో ఆయన లుక్, ఆటిట్యూడ్, డైలాగ్స్ దుమ్మురేపాయి. శ్రీలీల గ్లామర్ సైతం హైలెట్ గా నిలిచింది. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. థమన్ సంగీతం అందించారు.