Mahesh Babu: శ్రీలీలా తో డాన్స్ చేయడం అంత ఈజీ కాదు…ఒక్కొక్కరికి తాట ఊడిపోద్దన్న మహేష్…

మహేష్ బాబు ముందుగా త్రివిక్రమ్ గురించి మాట్లాడాడు ఆ తరువాత వాళ్ళ నాన్న సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మాట్లాడాడు ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ అయిన శ్రీలీలా గురించి మహేష్ బాబు మాట్లాడిన మాటలు మాత్రం ఇప్పుడు టాక్ అప్ ది ఇండస్ట్రీ గా నిలుస్తున్నాయి.

Written By: Gopi, Updated On : January 10, 2024 1:27 pm

Mahesh Babu

Follow us on

Mahesh Babu: సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గుంటూరు కారం సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న గుంటూరు లో నిర్వహించారు. ఈ ఫంక్షన్ కి వేల సంఖ్య లో అభిమానులు హాజరై ఈ ఈవెంట్ ని సక్సెస్ చేశారు. ఇదిలా ఉంటే ఈ ఈవెంట్ లో మహేష్ బాబు మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

మహేష్ బాబు ముందుగా త్రివిక్రమ్ గురించి మాట్లాడాడు ఆ తరువాత వాళ్ళ నాన్న సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మాట్లాడాడు ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ అయిన శ్రీలీలా గురించి మహేష్ బాబు మాట్లాడిన మాటలు మాత్రం ఇప్పుడు టాక్ అప్ ది ఇండస్ట్రీ గా నిలుస్తున్నాయి. ఇక మహేష్ బాబు మాట్లాడుతూ చాలా సంవత్సరాల తర్వాత ఒక తెలుగు అమ్మాయి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే తను ఒక మంచి నటి తనతో నటించడం కూడా చాలా కష్టం…ఇక దానికి మించి తను డాన్స్ మాత్రం అద్భుతంగా చేస్తుంది.

ఇక ఆమెతో డాన్స్ చేయాడమంటే మామూలు విషయం కాదు. ఒక్కొక్క హీరోకి తాట ఊడిపోద్ది అంటూ మహేష్ బాబు చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ గా మారాయి. అలాగే ఈయన మాట్లాడిన ఈ వీడియో కింద సోషల్ మీడియా లో శ్రీ లీలా అభిమానులు ఆమె మంచి డాన్సర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అమె తో డాన్స్ చేయాలంటే స్టార్ హీరోలైన ఎన్టీఆర్, అల్లు అర్జున్,రామ్ చరణ్ లు మాత్రమే సరిపోతారు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…

ఇక ఇదిలా ఉంటే గుంటూరు కారం సినిమా ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఇక పండుగ రోజు ఈ సినిమాని వీక్షించి జనాలందరూ ఎంటర్టైన్ అవ్వాలని ఈ సినిమా యూనిట్ కోరుకుంటుంది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన నాలుగు సినిమాల్లో అత్యంత భారీ అంచనాలతో గుంటూరు కారం సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమాని చూసిన ప్రతి అభిమాని కూడా చాలా థ్రిల్ ఫీల్ అవుతారు అంటూ సినిమా యూనిట్ చెప్పిన మాటలకు ఫ్యాన్స్ అయితే ఫుల్ ఫిదా అవుతున్నారు…