Namrata Shirodkar : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే మహేష్ – నమ్రత జంట ముందు వరసలో ఉంటుంది..ఒకరికోసం ఒకరు బ్రతకడం..జీవితాంతం ఎలాంటి గొడవలు లేకుండా సంతోషం గా ఉండడం వంటివి ఈ జంటని చూసి అందరూ నేర్చుకోవాలి..వంశీ సినిమా షూటింగ్ సమయం లో వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారి..ఆ తర్వాత ప్రేమగా చిగురించి ఇండస్ట్రీ లో ఎవరికీ తెలియకుండా చాలా సీక్రెట్ గా పెళ్లి చేసేసుకున్నారు.

దాంపత్య జీవితం లో చిన్నపాటి గొడవలకే విడాకులు తీసేసుకుంటున్న సెలెబ్రిటీలు ఉన్న ఈరోజుల్లో ఇన్నేళ్లు ఇంత సంతోషం గా, ఒక్క కాంట్రవర్సీ కూడా లేకుండా బ్రతికిన జంట ఏదైనా ఉందా అంటే అది వీళ్ళే..మహేష్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైనా నమ్రతా మీడియా ముందుకి ఎప్పుడూ కూడా రాలేదు..మహేష్ బాబు తలపెట్టిన బిజినెస్ లను చూసుకోవడానికి ఆమెకి కాలం మొత్తం గడిచిపొయ్యేది.
అంతటి బిజీ జీవితాన్ని గడుపుతున్న ఈమె చాలా కాలం తర్వాత ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది..ఈ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..మహేష్ – నమ్రతలకు గౌతమ్ మరియు సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..వీళ్లిద్దరు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు కూడా బాగా ముఖ పరిచయం ఉన్నవాళ్లు..గౌతమ్ ప్రస్తుతం లండన్ లో చదువుకుంటున్నాడు..సితార ఇంకా స్కూల్ స్టేజిలోనే ఉంది.
అయితే సితార గురించి నమ్రతా మాట్లాడుతూ ‘సితార ని మేము ప్లాన్ చేసుకొని కనలేదు..గౌతమ్ ఒక్కడు చాలు అనుకున్నాం..కానీ సితార లేకపోతే మా ఇద్దరి జీవితాలు ఎంత అసంపూర్ణంగా ఉండేదో మాకు అర్థం అయ్యింది..ఆ దేవుడు మాకు ఇచ్చిన విలువైన బహుమతి సితార’ అంటూ నమ్రత చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.