Homeక్రీడలుArgentina vs France : నేడు ఫ్రాన్స్ అర్జెంటీనా మధ్య సాకర్ ఫైనల్.. గెలుపెవరిది?

Argentina vs France : నేడు ఫ్రాన్స్ అర్జెంటీనా మధ్య సాకర్ ఫైనల్.. గెలుపెవరిది?

Argentina vs France : 36 సంవత్సరాలుగా కప్ కోసం ఎదురుచూస్తున్న జట్టు ఒకటి… డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో దిగి మరోసారి కప్ ఒడిసి పట్టాలని ఆశతో ఉన్న జట్టు మరొకటి.. తన కెరియర్ చివరి మ్యాచ్ ఆడుతున్న ఆటగాడు ఒకవైపు.. జట్టును మరోసారి జగజ్జేతగా నిలపాలని చూస్తున్న ఆటగాడు మరొకవైపు.. ఈ సమరంలో విజేత ఎవరు అయ్యేది ఎవరో? కన్నీళ్లు మిగిలేది ఎవరికో? మరికొద్ది గంటల్లో ఇది తేలనుంది. మొత్తానికి ప్రపంచ ఫుట్ బాల్ కప్ ఆఖరి అంకానికి చేరుకుంది..ఖతార్ వేదికగా ఈరోజు రాత్రి అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వీక్షించేందుకు సిద్ధమయ్యారు.

అన్ని సంచలనాలే

ప్రపంచం మెచ్చిన బ్రెజిల్ కథ క్వార్టర్స్ లో ముగిసిపోయింది.. నాలుగు సార్లు ఛాంపియన్ జర్మనీ గ్రూప్ దశలో నిష్క్రమించింది. స్పెయిన్, ఇంగ్లాండ్ నాకౌట్ లో ఒక దాని తర్వాత ఒకటి వెనుదిరిగాయి. సంచలనాల మొరాకో, అద్భుతాల క్రొయేషియా కు సెమిస్ లో అడ్డు కట్టపడింది. ఇక మిగిలింది కేవలం అర్జెంటీనా, ఫ్రాన్స్. అర్జెంటీనా ఇప్పటివరకు రెండు ప్రపంచ కప్ లు గెలిచింది. ఫ్రాన్స్ కూడా రెండుసార్లు విజేతగా నిలిచింది. ఈసారి ఈ రెండు జట్లు గ్రూప్ దశలో ఒక్కో మ్యాచ్ ఓడి ఫైనల్ చేరాయి. ఇక ఈ ప్రపంచకప్ లో మెస్సి ఐదు గోల్స్ చేశాడు. అలాగే ఫ్రాన్స్ యోధుడు ఎంబాపే కూడా ఐదు గోల్స్ చేశాడు. ఇటు చూస్తే ఆల్ టైం గ్రేట్ మెస్సీ కి తోడు అల్వా రేజ్, మార్టినెజ్, అటు చూస్తే ఎంబాపే, గ్రీజ్ మెన్, గీరూడ్.. ఇది కేవలం మ్యాచ్ మాత్రమే కాదు సమఉజ్జీల సమరం.

అర్జెంటీనా అంటేనే ఇష్టం

ఇంకా ఈ మెగా టోర్నీ లో అర్జెంటీనా గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.. ఎప్పటినుంచో మనకు బ్రెజిల్ ఫేవరెట్ జట్టు. కానీ అది కప్ రేసు లో నుంచి వెళ్లిపోగానే మనవాళ్లు తమ ఆశలను అర్జెంటీ నా వైపు మళ్ళించారు.. అంతేకాదు అర్జెంటీనా ఆటగాడు మెస్సికి భారత్ లో కోట్లల్లో అభిమానులు ఉన్నారు. వాళ్లందరి కోరిక కూడా అర్జెంటీనా గెలవాలనే. పైగా ఐరోపా జట్ల కంటే దక్షిణ అమెరికా జట్ల మీదే మన వాళ్లకు గురి ఎక్కువ..

ఫ్లూ దెబ్బ

ప్రపంచ కప్ ఫైనల్ ముగిట ఫ్రాన్స్ జట్టులో ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఈ జట్టు శిబిరంలో ఫ్లూ విస్తరిస్తుండడంతో ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారు.. ఇప్పటికే డయోట్, రాబియట్ మొరాకో తో సెమీస్ మ్యాచ్ కు దూరమయ్యారు. అయినప్పటికీ అర్జెంటీనా సులువుగానే గెలిచేసింది.. అయితే ఫైనల్ ముంగిట వరానే లాంటి కీలక ఆటగాడితోపాటు కొనాటే కూడా ఫ్లూ బారిన పడ్డాడు. వాళ్ళిద్దరూ జలుబు,కాస్త జ్వరంతో బాధపడుతున్నట్టు తెలిసింది. వరానే ఫైనల్ కు అందుబాటులో లేకుండా పోవడం ఫ్రాన్స్ కు పెద్ద ఎదురు దెబ్బ.

ఏది నెగ్గినా

అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లలో ఏది ఫైనల్ లో నెగ్గినా వారికి మూడో ప్రపంచకప్ అవుతుంది.. అర్జెంటీనా 1978, 1986లో విజేతగా నిలిచింది. ఫ్రాన్స్ 1998, 2018 లో ఛాంపియన్ అయింది. అర్జెంటీనా దక్షిణ అమెరికా జట్టు.. ఫ్రాన్స్ ఐరోపా కు ప్రాతినిధ్యం వహిస్తోంది.. ఈ రెండు ఖండాల జట్ల మధ్య జరిగిన పది ఫైనల్స్ లో ఏడుసార్లు దక్షిణ అమెరికా జట్టు దే విజయం. 1998లో ప్రపంచ కప్ గెలిచిన ఫ్రాన్స్ జట్టులో సభ్యుడైన డెస్ చాంప్స్… 2018లో ఆ జట్టు కోచ్ గా ప్రపంచ కప్ సాధించాడు. ఈసారి కూడా అతను ఫ్రాన్స్ ను విజేతగా నిలిపితే.. ఇటలీ కోచ్ పోజో 1934, 1938 తర్వాత రెండు ప్రపంచ కప్ లు సాధించిన కోచ్ గా రికార్డులకు ఎక్కుతాడు. 19 ఏళ్ల వయసులో 2018 ప్రపంచ కప్ ఫైనల్లో గోల్ కొట్టి ఫ్రాన్స్ ను గెలిపించిన ఎంబాపే.. బ్రెజిల్ దిగ్గజం పీలే(1958-17 ఏళ్ళు) తర్వాత ప్రపంచ కప్ ఫైనల్లో స్కోర్ చేసిన అతిపిన్న వయస్కుడు అయ్యాడు. ఈసారి ఫ్రాన్స్ నెగితే తన తొలి రెండు ప్రపంచ కప్ ల్లో టైటిల్ సాధించిన పీలే (1958-1964) రికార్డును ఎంబాపే సమం చేస్తాడు..

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular