Homeఎంటర్టైన్మెంట్మహేష్ పెట్టుడు మీసం మీద కామెంట్ చేసిన నమ్రత

మహేష్ పెట్టుడు మీసం మీద కామెంట్ చేసిన నమ్రత

Mahesh Babu New Look Shared By Wife Namrata
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడూ ఛార్మింగ్ లుక్ లోనే కనిపిస్తుంటారు. ఆయన వయసు కనబడకపోవడానికి మంచి ఫిజిక్ మెయింటైన్ చేయడం, హెల్తీ డైట్ ఫాలో అవడంతో పాటు ఎప్పుడూ సన్నని మీసంతో ఉండటమే కారణం. మహేష్ సినిమాల్లో కానీ బయట కానీ ఎప్పుడూ గుజురు మీసంతో కనబడరు. ఎప్పుడూ ఒకే స్టైల్.. సన్నని మీసకట్టు. అదే ఆయనకు అందం అంటుంటారు అభిమానులు. కానీ అప్పుడప్పుడు వారికి కూడ మహేష్ బాబును దట్టమైన మీసంతో చూడాలనే కోరిక కలుగుతుంటుంది.

Also Read: ఎన్టీఆర్ ముస్లిం గెటప్ తీయడం కుదరదట

అందుకే మహేష్ ఎప్పుడైనా ఒకసారి కృత్రిమమైన మీసం పెట్టుకుని కనిపించి అలరిస్తుంటారు. గతంలో ‘భరత్ అనే నేను’ చిత్రంలో పెట్టుడు మీసం పెట్టుకుని అచ్చు కృష్ణగారిలా కనబడి సప్రైజ్ చేసిన మహేష్ ఈమధ్య ఒక వాణిజ్య ప్రకటనలో అలాగే నిండైన మీసం పెట్టుకుని కనబడ్డారు. అలా మహేష్ ఆర్టిఫిషియల్ మీసం పెట్టుకుని యాడ్ షూట్ చేయడం గురించి మహేష్ భార్య నమ్రత సరదాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.

Also Read: శ్రీహరి విషయంలో ముందే చెప్పిన బాలయ్య.. ఎమోషనల్?

మహేష్ మీసం పెట్టుకుంటున్న ఫోటోను షేర్ చేసిన ఆమె ఇలాంటి కృత్రిమమైన మీసం లాంటివి వాస్తవికంగా అనిపించవు. వాటితో షూటింగ్ చేయడం ఎప్పుడూ సరదాగా, సౌకర్యంగా ఉండవు. కానీ మనవైపు నిపుణులు ఉన్నప్పుడు ఇలాంటి ఛాలెంజెస్ తీసుకోవడం ఇష్టపడని వారెవరు ఉంటారు అంటూ కామెంట్ పెట్టారు. నమ్రత చేసిన సరదా కామెంట్ నెటిజన్లకుమంచి ఫన్ అందిస్తోంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular