మాజీ గ్లామర్ బ్యూటీ ‘నమిత’ కూడా బిజినెస్ మొదలెట్టింది. మరి వ్యాపారవేత్తగా నమిత ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి, ఇంతకీ ఈ భారీ బ్యూటీ చేస్తోన్న వ్యాపారం ఏమిటంటే.. వెబ్ సిరీస్ ల నిర్మాణం. డిజిటల్ స్ట్రీమింగ్ వ్యాపారంలోకి అడుగు పెట్టడానికి ఇప్పటికే అన్ని రకాలుగా సన్నాహాలు చేసుకుంది. ఆల్ రెడీ రెండు కథలను కూడా నమిత ఫైనల్ చేసుకుంది.
పైగా “నమిత థియేటర్” అనే పేరుతో ఆమె ఓటీటీ ని కూడా లాంచ్ చేయడం విశేషం. అన్నట్టు తన నమిత థియేటర్ ద్వారా కొత్త టాలెంట్ ని ప్రోత్సహిస్తూ అద్భుతమైన కంటెంట్ ను ప్రేక్షకులను అలరించాలని నమిత భారీగానే ప్లాన్ చేసుకుంది. ఇందులో భాగంగా చిన్న చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ లు మరియు షార్ట్ ఫిలిమ్స్ ను కూడా ఆమె నిర్మించబోతుందట.
ఇక నమిత ముఖ్యంగా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తోనే తన వెబ్ కంటెంట్ ఉండాలని, అందుకే ప్రస్తుతం ఆమె మెయిన్ ఫోకస్ మొత్తం రియల్ ఇన్సిడెంట్స్ పైనే ఉందట. సెకెండ్ హీరోయిన్ గా పలు పాత్రలలో నటించి తన అందాలను పరిచి ఫుల్ క్రేజ్ సంపాదించింది నమిత. మొత్తానికి వెండితెరకు ఈ మధ్య కాస్త బ్రేక్ ఇచ్చి, ప్రస్తుతం నిర్మాణం పైనే ఫోకస్ పెట్టింది.
ఎలాగూ సినిమాల్లో బాగానే డబ్బు సంపాదించింది. వచ్చిన డబ్బును మళ్ళీ సినిమాల్లోనే పెట్టాలని, సినిమాలు, అలాగే వెబ్ సిరీస్ ల వ్యాపారంలోకి దిగిందట. నిజానికి ఎప్పటి నుండో నమిత నిర్మాత అవ్వాలని ప్లాన్ చేసుకుంటోంది. ఈ భారీ బ్యూటీ ఎట్టకేలకూ త్వరలోనే నిర్మాతగా మారబోతుంది.