-నటీనటులు :
అమిత్ తివారీ
భానుశ్రీ
తనికెళ్ళ భరణి
నాజర్
కాలకేయ ప్రభాకర్
ముక్కు అవినాష్
అజయ్ ఘోష్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : రవి చరణ్
నిర్మాత : ఆర్ ఎమ్
సంగీతం : పీఆర్
సినిమాటోగ్రాఫర్ : వేణు మురళి
ఎడిటర్ : శివ సర్వాణి
ఫైట్స్ : నబా

డైరెక్టర్ రవి చరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా నల్లమల.. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమాలో అమిత్ తివారీ, భానుశ్రీ, తనికెళ్ళ భరణి, నాజర్, కాలకేయ ప్రభాకర్, ముక్కు అవినాష్, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగే అక్రమాల నేపథ్యంలో జరిగింది..
Also Read: Telangana BJP: తెలంగాణ బీజేపీ సంచలనం.. కేసీఆర్ కు షాక్ తప్పదా?
ఈ సినిమాలో నల్లమల (అమిత్ తివారీ) అక్రమ వ్యాపారం చేసేవారికి సహాయం చేస్తుంటాడు.. ఈయన మొరటోడుల కనిపించినా ఆయన వద్ద మేలు రకం జాతి ఆవు ఉంది.. అది అంటే ఆయనకు పంచ ప్రాణాలు.. తమ గూడెంలో ఉండే వనమాలి ( భానుశ్రీ ) మనసుకు నల్లమల దగ్గర అవుతాడు. ఈయన కొన్ని పరిస్థితుల్లో అటవీ ప్రాంతంలో అక్రమ వ్యాపారం చేసే వారికీ సహాయం చేస్తూ ఉంటాడు. నల్లమలలో పోలీస్ ఆఫీసర్, అక్రమ వ్యాపారం చేసే పనులు ఏంటి? ఏ విషయంలో అక్రమ వ్యాపారులకు నల్లమల ఎదురు తిరుగుతాడు అనేది మిగిలిన కథ..
విశ్లేషణ : డైరెక్టర్ హీరో, హీరోయిన్ మధ్య ప్రేమను చూపించిన విధానం బాగానే ఆకట్టుకుంది.. ఈ సినిమాకు మంచి కథను ఎన్నుకోవడమే కాకుండా.. నటీనటులను కూడా పర్ఫెక్ట్ గా ఎన్నుకున్నాడు.
నటీనటులు & టెక్నిషియన్స్ : ఈయన ఎన్నుకున్న నటీనటులు కూడా తమ పాత్రలతో బాగానే మెప్పించారు.. హీరో పాత్రలో నటించిన అమిత్ తివారి అయితే ప్రేక్షకులను బాగా మెప్పించి తనకు మంచి మార్కులు వేయించుకున్నాడు. సాకేంతికంగా కూడా టీమ్ అంతా అద్భుతంగా పని చేసింది. కథ, స్క్రీన్ ప్లే, పాటలు కూడా డైరెక్టర్ చరణ్ నే అందించాడు.. ఇలా నటీనటులే కాకుండా సాంకేతిక టీమ్ కూడా పర్వాలేదు అనిపించారు.
ఇలా డైరెక్టర్ ఈ తరం ప్రేక్షకులను మెప్పించే విధంగానే ఈ సినిమాను తెరకెక్కించాడు.. అలాగే ఈ సినిమా ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది..ఈ సినిమాతో డైరెక్టర్ గా రవి చరణ్ మంచి సక్సెస్ అందుకున్నాడు కాబట్టి గుర్తింపు పొందాడు.. అలాగే హీరోగా నటించిన అమిత్ కూడా ఈ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు.
Also Read: Nagababu: నాగబాబు తన అల్లుడికి ఇచ్చిన కట్నకానుకలు ఇవే !
చివరిగా.. ప్రేక్షకులు ఒకసారి చూసే విధంగా ఈ సినిమా ఉంది..
oktelugu.com రేటింగ్ : 2.75/5