Naina Ganguly- Apsara Rani: రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది చివరకు చర్చనీయాంశమే అవుతుంది. ఆయన మైండ్ లో ఎలాంటి ఆలోచనలు మెదులుతాయో చెప్పడం అంత సులువు కాదు. ఆయన తీసే సినిమాలు చాలా సార్లు వివాదాస్పదమే అవుతుంటాయి. అయితే ఈసారి మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఇద్దరు లెస్బియన్ అమ్మాయిల క్రైమ్ థ్రిల్లర్ కథతో నానా రచ్చ చేస్తున్నాడు.

డేంజరస్ అనే లెస్బియన్ పాత్రల్లో నైనా గంగూలీ, అప్సర రాణిలతో ఓ రేంజ్‌లో రొమాంటిక్ సీన్లను పండించాడు ఆర్జీవీ. ఈ ఇద్దరి మధ్య వచ్చే సీన్లతో ఇప్పటికే పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లను వదిలాడు ఆర్జీవీ. వీరిద్దరి మధ్య రొమాన్స్ ఓ రేంజ్‌లోనే ఉందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. పైగా దీన్ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నాడు. ఏప్రిల్ 8న తెలుగులో మా ఇష్టం పేరుతో సినిమా వస్తోంది.
Also Read: Varun Tej: వరుణ్ తేజ్‌కు తలనొప్పిగా మారిన నిహారిక పబ్ రైడ్.. టెన్షన్‌లో మెగా ఫ్యామిలీ..!
ఇప్పటికే ఆర్జీవీ తన డేంజరస్ హీరోయిన్లను వెంటేసుకుని చెన్నై, ఢిల్లీ, బెంగుళూరు, ముంబై లాంటి నగరాల్లో వరుస ఇంటర్వ్యూలతో నానా రచ్చ చేస్తున్నాడు. ఐదు భాషల్లో ఈ మూవీ వస్తోంది. రాజమౌళికి ఇద్దరు పవర్ ఫుల్ హీరోలు ఉంటే.. తనకు ఇద్దరు కత్తిలాంటి హీరోయిన్లు ఉన్నారంటూ త్రిబుల్ ఆర్‌ను కూడా తన ప్రమోషన్స్ కోసం వాడేస్తున్నాడు ఆర్జీవీ.
ఇక ఈ ఇద్దరి మధ్య లిప్ లాక్‌లు, రొమాన్స్ చూస్తుంటే ఆర్జీవీ ఏ రేంజ్‌లో ఈ మూవీని తెరకెక్కించాడో అర్థమవుతోంది. ఇక తాజాగా వదిలిన క్లిప్పింగ్ చూస్తుంటే.. ఇందులో కూడా నైనా గంగూలీ, అప్సర రొమాన్స్ తో పిచ్చెక్కిస్తున్నారు. ఒకరిని ఒకరు నాకేసుకుంటూ.. ముద్దులతో రెచ్చిపోతున్నారు. మరీ ఈ స్థాయిలో రొమాన్స్ పెట్టడమంటే అది ఆర్జీవీకే సాధ్యమేమో అనిపిస్తుంది.

ఎందుకంటే కెమెరా షాట్స్ తీయడంలో ఆర్జీవీ పనితనం అందరికీ తెలిసిందే. పైగా తన కెరీర్‌లోనే బెస్ట్ షాట్స్ తీశానంటూ చెబుతున్నాడు ఆర్జీవీ. ఇప్పటికే చాలా వివాదాస్పద బయోపిక్ కథలతో టాప్ ఆఫ్ ది టౌన్ గా మారిన ఆర్జీవీ.. ఈ సారి లెస్బియన్ అంటూ చేస్తున్న ఈ మూవీతో ఇంకెంత వివాదాస్పదం అవుతాడో చూడాలి.
Also Read:Hrithik Roshan: యంగ్ హీరోయిన్ తో స్టార్ హీరో పెళ్లి.. రుజువు ఇదే !
[…] Sai Kumar Voice: సినిమాల్లో ఒక పాత్రకే పరిమితమైపోయేవారు కొందరు ఉంటారు. వారు హీరోగానే చేసి రిటైర్ అయిపోతుంటారు. శోభన్ బాబు హీరోగా తప్పితే వేరే క్యారెక్టర్ చేయనని ఏకంగా సినిమాల నుంచి రిటైర్ అయిపోయారు. కానీ ఈయన అలాకాదు.. హీరో విలన్ నుంచి మొదలుపెడితే సకల క్యారెక్టర్లు చేసి సకల కళా వల్లబుడిగా ఆరితేరిన నటుడు ఒకరు ఉన్నారు. ఆయన ఒక విలన్.. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఒక సపోర్టింగ్ ఆర్టిస్ట్.. ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కూడా.. ఇదంతా విన్నాక మీకు ఆయన ఏ ఆర్టిస్ట్ అనేది ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. […]