Homeఎంటర్టైన్మెంట్NTR- Nagma: ట్రోల్‌ ఆఫ్‌ ది డే : నగ్మాతో ఎన్టీఆర్‌ రొమాన్స్‌.. నాటు...

NTR- Nagma: ట్రోల్‌ ఆఫ్‌ ది డే : నగ్మాతో ఎన్టీఆర్‌ రొమాన్స్‌.. నాటు నాటు కు పునాదులేసింది ఇక్కడి నుంచేనట!

NTR- Nagma
NTR- Nagma

NTR- Nagma: పంచ వ్యాప్తంగా ఇప్పుడు నాటు.. నాటు.. పాట మార్మోగుతోంది. వయసుతో సంబంధం లేకుండా, స్రీ, పురుష బేధం లేకుండా అందరూ పాటకు స్టెప్పులేస్తున్నారు. కొంతమంది హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ను అనుకరిస్తుండగా, మరికొందరు.. తమకు నచ్చినవిధంగా స్పెప్స్‌ వేస్తున్నారు. కొంతమది డ్యాన్స్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. విశ్వమంతా ఉర్రూతలూగురున్న ఈ పాటకు మూడు రోజుల క్రితం ఆస్కార్‌ అవార్డు వచ్చింది. అయితే ఈ పాటకు సంబంధించిన ఇప్పుడు డ్యాన్సులు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తుండగా, మరోవీడియో కూడా వైరల్‌ అవుతోంది. ‘నాటు.. నాటు..’కు ఇక్కడే బీజం పడింది అని అల్లరి రాముడు సినిమాలోని ఓ సన్నివేశం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

నగ్మాకు నాటు కేక పెట్టించి..
అల్లరి రాముడు చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ తన మేనత్తగా నటించిన నగ్మాకు నాటు వైద్యం చేస్తాడు. ఈ సందర్భంగా నగ్మా పెట్టిన నాటు కేక.. నాటు వైద్యం నుంచి నాటు.. నాటు పాట పుట్టిందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. అల్లరి రాముడులో నగ్మా చాలాకాలంగా నడుమునొప్పితో బాధపడుతుంది. దానికి వైద్యలు పరీక్షలు చేసి రెండు నెలల చికిత్స అవసరమని చెబుతారు. ఆ ఇంట్లో పనివాడిగా చేరిన జూనియర్‌ ఎన్టీఆర్‌ విషయం విని.. లక్షలకు లక్షలు దొబ్బేయడానికి ఆస్పత్రిలో చేరమంటున్నారనా అని నిలదీస్తారు. మూడు నిమిషాల్లో నయం చేసే నొప్పికి మూడు నెలల ట్రీట్‌మెంట్‌ ఏంటని నిలదీస్తాడు. వైద్యులు ఆశ్చర్యపోతారు. ఈ సినిమాలో మామ పాత్ర పోషించిన సీనియర్‌ నటుడు నరేశ్‌ కూడా షాక్‌ అవుతాడు. ఎలా తగ్గిస్తావురా అని ప్రశ్నిస్తాడు. చేసి చూపిస్తా అనడంతో సరే పదా అంటూ గదివైపు కదులుతారు. కానీ, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఒంటి వైద్యం చేసేప్పుడు ఎవరూ చూడొద్దని ఒక్కడే గదిలోకి వెళ్తాడు. అక్కడ నగ్మా అతడిని చూసి భయపడుతుంది. ఏంటిరా ఏం చేస్తావని నిలదీస్తుంది నగ్మ. ఉండండి ఒంటి వైద్యం చేస్తానని చెప్పి ఎన్టీఆర్‌ ఆమె వీపుపై కూర్చుని నగ్మా ఒళ్లు విరుస్తాడు. ఆ దెబ్బకు ఆమె పెట్టిన కేకతో ఇంట్లోని వారంతా అదిరిపోతారు. భర్త పాత్ర పోషించిన నరేశ్‌ 20 ఏళ్ల కాపురంలో నేను ఎన్నడూ ఇలాంటి కేక పెట్టించలేకపోయానని డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌ వదులుతాడు. ఎన్టీఆర్‌ వైద్యంతో నొప్పి తగ్గిపోతుంది. ‘అదంటి నాటు వైద్యం అంటే’ అని చెబుతాడు ఎన్టీఆర్‌. ఇలా నాటు పదం రెండ మూడుసార్లు వాడతాడు ఎన్టీఆర్‌..

NTR- Nagma
NTR- Nagma

చంద్రబోస్‌ అక్కడి నుంచే తీసుకున్నాడా..
ఆస్కార్‌ అవార్డు పాట రాసిన చంద్రబోస్‌ నాటు.. నాటు పదాలను అల్లరి రాముడు నుంచే తీసుకున్నట్లు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అలా పడిన బీజమే నేడు విశ్వవేదికపై అందరితో గెంతులు వేయిస్తోందని, ప్రపంచాన్ని షేక్‌ చేస్తుందని పలువురు కామెంట్‌ చేస్తున్నారు. మొత్తంగా తెలుగు పాట ‘నాటు.. నాటు..’కు ఆస్కార్‌ రావడం ప్రతీ భారతీయ సినీ ప్రియుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular