Nageswara Rao likes that hero dance very much
Akkineni Nageswara Rao: సినిమా ఇండస్ట్రీలో నాగేశ్వరరావుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన ఒకప్పుడు చేసిన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేవి అయినప్పటికీ ఆయన ప్రతి సినిమా విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండేవాడు. అలాగే తను మంచి సినిమాలు చేయాలి అనేదాని మీదనే చాలా కసరతులు చేస్తూ ఎన్టీఆర్ తో పాటు పోటీగా సినిమాల్లో నటిస్తూనే తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలు కూడా సాధించాయి.
ఇక నాగేశ్వరరావు చాలామంది హీరోలతో కలిసి నటించినప్పటికీ ఆయనకి చిరంజీవి(Chiranjeevi) తో నటించడం అంటే చాలా ఇష్టమట. అలాగే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ‘మెకానిక్ అల్లుడు’ అనే సినిమా కూడా వచ్చింది. అయితే ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కానప్పటికీ ఈ కాంబినేషన్ కి మాత్రం మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఇక ఇదిలా ఉంటే నాగేశ్వరరావుకు చిరంజీవి డ్యాన్స్ అంటే చాలా ఇష్టమట. ఆయన చేసే డ్యాన్స్ చాలా బాగుంటుంది.ఆయన స్ప్రింగ్ లాగా కదులుతూ చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీ గా డాన్స్ చేస్తాడు అంటూ నాగేశ్వరావు ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి మీద తనకున్న అభిమానాన్ని తెలియజేశాడు. ఇక చిరంజీవి లాంటి హీరో ఇండస్ట్రీలో చాలా అవసరం.
మా తరం అయిపోయిన తర్వాత చిరంజీవి లాంటి ఒక్క యంగ్ డైనమిక్ హీరో ఇండస్ట్రీకి రావడం అనేది మా అందరికి చాలా సంతోషంగా అనిపించింది. అలాగే ఆయన నటన గాని, ఆయన చేసిన డ్యాన్సులు గాని అలాగే ఆయన ఎంచుకున్న సినిమాలు చాలా వరకు సక్సెస్ లు అవ్వడం చూస్తుంటే మా అందరికి గర్వంగా అనిపిస్తూ ఉంటుందని ఆయన ఒక సందర్భంలో తెలియజేయడం విశేషం…
ఇక మొత్తానికైతే నాగేశ్వరరావు చిరంజీవి మీద తన ఇష్టాన్ని తెలియజేస్తూ మాట్లాడటం అనేది అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు…